- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అయ్యో రామ చిలుక.. ఎంత కష్టమొచ్చిందో!?
రాష్ట్రంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు విధ్వంసం సృష్టించాయి. నిన్నటి నుంచి కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. మెరుపులు, ఉరుములు, బలమైన ఈదురు గాలులతో కూడిన తుఫాను వర్షాలు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాయి. బలమైన ఈదురు గాలులకు చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో నిన్న(బుధవారం) అర్థరాత్రి కురిసిన తుఫానుతో కూడిన భారీ వర్షం కారణంగా బామోర్ అటవీ శ్రేణిలోని సింగర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీ వర్షాలకు వందలాది చిలుకలు మృతి చెందాయి. ఉదయం, గ్రామంలోని చెరువు ఒడ్డున ఉన్న ఆలయం దగ్గర నేలపై గాయపడి చనిపోయిన చిలుకలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
వందల చిలుకలు చనిపోగా.. మరికొన్ని చిలుకలు రెక్కలు విరిగిపోయి ఎగరలేని పరిస్థితుల్లో నెలకొరిగాయి. ఈ విషాద ఘటనను చూసి ఆవేదన చెందిన గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఈ క్రమంలో వెంటనే అటవీ శాఖ బృందం సంఘటన స్థలానికి చేరుకుని స్థానిక ప్రజల సహాయంతో గాయపడిన చిలుకలను చికిత్స కోసం బామోర్‌లోని జంతు ఆరోగ్య కేంద్రానికి పంపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో గాయపడిన లేదా చనిపోయిన చిలుకల కోసం వెతకడానికి అటవీ శాఖ ఉద్యోగులను నియమించారు.
స్థానికుల వివరాల ప్రకారం.. ఆలయానికి సమీపంలోని చెట్లపై పెద్ద సంఖ్యలో చిలుకలు నివసించేవని చెబుతున్నారు. ఈ క్రమంలో నిన్న రాత్రి ఆకస్మాత్తుగా వచ్చిన బలమైన తుఫాను, భారీ వర్షం యొక్క తాకిడిని ఈ చిలుకలు తట్టుకోలేకపోయాయని తెలిపారు. ఈ తుఫాను కారణంగా వందలాది చిలుకలు నేలపై పడి వాటి రెక్కల గాయాల కారణంగా మరింత గాయపడ్డాయి. ఈ సంఘటనలో వందలాది చిలుకలు చనిపోయాయని చెబుతున్నారు.






