- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
న్యాయవాద వృత్తిలో హాస్యం అవసరం.. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రచించిన పుస్తకాలను సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ ఇవాళ ఆవిష్కరించారు.

దిశ, వెబ్‌డెస్క్: న్యాయవాద వృత్తిలో హాస్యం కూడ అవసరమేనని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) అన్నారు. ఇవాళ ఢిల్లీలో ఆయన సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా (Solicitor General Tushar Mehta) రాసిన పుస్తకాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ.. తుషార్ మెహతాలోని రచనా ప్రతిభను కొనియాడారు. చట్టపరమైన అంశాలను డ్రామా, స్టాండ్-అప్ కామెడీ తరహా హాస్యంతో మేళవించి రాయడంలో తుషార్ మెహతా సిద్ధహస్తుడని ప్రశంసించారు.
కోర్టు గదుల్లో ఉండే గంభీరమైన వాతావరణం మధ్య హాస్యం కూడా అవసరమేనని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. వృత్తిపరమైన అనుభవాలను తుషార్ మెహతా ఎంతో ఆసక్తికరంగా పుస్తక రూపంలోకి తెచ్చారని సీజేఐ పేర్కొన్నారు. ఆయన రచనలు కేవలం న్యాయ నిపుణులకే కాకుండా, సామాన్యులకు కూడా అర్థమయ్యేలా, వినోదాన్ని పంచేలా ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ‘కోర్టు రూమ్ డ్రామా’, ‘స్టాండ్-అప్ హ్యూమర్’ అంశాలను ఆయన పుస్తకాల్లో ప్రస్తావించిన తీరు అద్భుతమని కొనియాడారు. తుషార్ మెహతా కేవలం దేశంలోని అత్యున్నత న్యాయ అధికారులలో ఒకరు మాత్రమే కాదని, ఆయన ఓ మంచి సాహితీవేత్త అని ఈ పుస్తకాల ద్వారా నిరూపితమైందని జస్టిస్ సూర్య కాంత్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు, ప్రముఖులు పాల్గొన్నారు.






