Big Breaking News : పాకిస్థాన్ పేలిన మానవబాంబు.. 'ఛాంపియన్స్ ట్రోఫీ' భద్రతపై నీలినీడలు

by Muthe.Rajitha |

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy 2025)కి అతిధ్యం ఇస్తున్న పాకిస్థాన్(Pakistan) కు భారీ షాక్ తగిలింది.

Big Breaking News : పాకిస్థాన్ పేలిన మానవబాంబు.. ఛాంపియన్స్ ట్రోఫీ భద్రతపై నీలినీడలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025(ICC Champions Trophy 2025)కి అతిధ్యం ఇస్తున్న పాకిస్థాన్(Pakistan) కు భారీ షాక్ తగిలింది. శుక్రవారం సాయంత్రం ప్రార్థనల్లో బాంబు దాడి(Bomb Attack) జరిగింది. పాక్ లో పెషావర్లోని దారుల్ ఉలుం హఖానియా మాదర్సాలో ఈ దాడి(Madarasa Attack) జరిగినట్టు తెలుస్తోంది. శుక్రవారం సాయంత్రం మాదర్సాలో ప్రార్థనలు జరుగుతుండగా.. ఓ సూసైడ్ బాంబర్(Human Bomber) వారివైపు దూసుకు వచ్చినట్టు సమాచారం. ప్రార్థనలు చేస్తున్నట్టు నటించి తనను పేల్చేసుకోగా ఆ భవనం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ దాడిలో ఐదుగురు అక్కడిక్కడే మరణించగా.. 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఈ దాడి అనంతరం పెషావర్లో ఎమర్జెన్సీ విధించారు. అయితే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీ జరుగుతున్న వేళ.. పాక్ లో ఈ బాంబు దాడి జరగడం కలకలం రేపుతోంది. టోర్నీ భద్రతపై పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. టోర్నీని తక్షణమే పాక్ నుంచి తరలించాలని ఐసీసీకి డిమాండ్లు మొదలయ్యాయి.

Next Story