లోక్‌సభలో కేంద్రానికి భారీ ఎదురుదెబ్బ.. రేపు కేంద్ర కేబినెట్ భేటీ!

by Ramesh Naini |

లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

లోక్‌సభలో కేంద్రానికి భారీ ఎదురుదెబ్బ.. రేపు కేంద్ర కేబినెట్ భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: లోక్‌సభ స్థానాలను 850కి పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనకు సభలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు తగిన సంఖ్యా బలం లేకపోవడంతో లోక్‌సభలో వీగిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం, సభలో ప్రవేశపెట్టాల్సిన మిగిలిన రెండు బిల్లులను వెనక్కి తీసుకుంది.తాజా రాజకీయ పరిణామాలపై చర్చించేందుకు రేపు (శనివారం) ఉదయం 11:30 గంటలకు కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశం కానున్నట్లు అధికార వర్గాల సమాచారం. బిల్లు ఆమోదం పొందడానికి సభలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అవసరం కాగా, ప్రభుత్వం ఆ సంఖ్యను చేరుకోవడంలో విఫలమైంది. ఎన్డీయే కూటమికి అదనంగా మరో 6 ఓట్లు పోలైనప్పటికీ బిల్లు గట్టెక్కలేకపోయింది. ఓటింగ్‌లో పాల్గొన్న మొత్తం ఎంపీలు 528, బిల్లుకు అనుకూలంగా (Yes) 298 , బిల్లుకు వ్యతిరేకంగా (No) 230 , బిల్లు నెగ్గేందుకు అవసరమైన బలం 352 ఉండాలి.

ఎన్డీయే కీలక సమావేశం

మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు, కావాల్సిన మెజార్టీ సాధించలేకపోయింది. ఈ బిల్లు వీగిపోయిన వెంటనే అధికార పక్షం తదుపరి వ్యూహరచనలో పడింది. ఇందులో భాగంగా కాసేపట్లో ఎన్డీయే పక్షాల కీలక సమావేశం జరగనుంది. ఈ భేటీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మిత్రపక్షాలతో కలిసి సభలో ఎదురైన తాజా పరిస్థితిని సమీక్షించడంతో పాటు, రేపటి కేబినెట్ సమావేశంలో తీసుకోవాల్సిన నిర్ణయాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నట్లు సమాచారం.

Next Story