తెలుగులో బలగం.. హిందీలో ఛావా.. అసలు విషయం ఇదే..?

by Malleboina Mahesh |   (  Updated:2025-07-27 09:06:01  IST  )

పక్క తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా.. జబర్దస్త్ కమెడియన్ వేణు తీసిన బలగం సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది.

తెలుగులో బలగం.. హిందీలో ఛావా.. అసలు విషయం ఇదే..?
X

దిశ, వెబ్ డెస్క్: పక్క తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా.. జబర్దస్త్ కమెడియన్ వేణు తీసిన బలగం సినిమా (Balagam movie) టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. చిన్న సినిమా అయినప్పటికీ.. మౌత్ టాక్ విపరీతంగా పెరిగిపోవడంతో.. పల్లె, పట్టణం అని తేడా లేకుండా.. ఆటోలు, ట్రాక్టర్లు, బస్సులు, లారీలు కట్టుకొని మరి వెళ్లి బలగం సినిమాను థియేటర్లలో చూశారు. అనంతరం కొద్దిరోజులకు ఓటిటీలో కూడా ఈ సినిమా చరిత్ర సృష్టించగా.. ప్రతి గ్రామంలో ప్రత్యేకంగా స్క్రీన్లను ఏర్పాటు చేసి.. తమ గ్రామస్తులకు బలగం సినిమాను చూయించారంటే ప్రజలకు ఎంత కనెక్ట్ అయిందో అర్థం చేసుకోవచ్చు. కాగా ప్రస్తుతం బలగం సినిమా లాంటి పరిస్థితులే.. నార్త్ ఇండియాలో ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, యూపీ ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం.. శివాజీ మహారాజ్ కుమారుడు అయిన శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర (Biography of Sambhaji Maharaj)ను ఆధారంగా చేసుకొని తీసిన ఛావా సినిమా (Chava movie) ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని (Huge success worldwide) సాధించింది.

ఈ సినిమా అన్ని రాష్ట్రాల్లో కలిపి దాదాపు 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టుకుంది. ఈ క్రమంలో తెలుగులో భారీగా డిమాండ్ (Huge demand) పెరగడంతో తెలుగులోను ఈ సినిమాను తెలుగు లోకి డబ్ చేశారు. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో విజయవంతంగా ఆడుతుంది. ఇదిలా ఉంటే నార్త్ లో ఈ సినిమాను ఏకంగా ప్రత్యేక షోలను ఏర్పాటు చేసి స్కూల్ విద్యార్థులను తీసుకెళ్లి సినిమా చూపిస్తున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో.. ప్రత్యేకమైన స్క్రీన్లను ఏర్పాటు చేసి ఛావా సినిమాను ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గతంలో బలగం సినిమా.. కుటుంబంలో బంధుత్వాలను బలపరచగా.. ఛావా సినిమా.. మరాఠా సామ్రాజ్య యోధుని హిడెన్ చరిత్రను వెలుగులోకి తెచ్చిందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Video Link

Next Story