Chhattisgarh: మావోయిస్టులకు మరో షాక్.. భారీగా డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లు

by Ramesh Naini |   (  Updated:2024-12-07 08:58:13  IST  )

మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్‌లో తాజాగా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు.

Chhattisgarh: మావోయిస్టులకు మరో షాక్.. భారీగా డంప్ స్వాధీనం చేసుకున్న జవాన్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్రం నారాయణపూర్‌లో తాజాగా జవాన్లు కూంబింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా మావోయిస్టుల భారీ డంపును జవాన్లు గుర్తించారు. సోన్‌పూర్-కోహ్కమెటా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‌ను జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. అందులో వంట గ్యాస్ సిలిండర్‌లు, వంట సరుకులు, సబ్బులు, వెల్డింగ్ గ్యాస్ సిలిండర్‌లు, ఫోల్డబుల్ చైర్, వెపన్ మేకింగ్ మెషిన్, ఇతర సామాగ్రిని అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం అధికారులు ఫోటోలు విడుదల చేశారు.

మావోయిస్టులు, పోలీసుల ఎదురుకాల్పులు

అదేవిధంగా ఛత్తీస్‌గడ్ కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కాక్‌నార్-కుర్‌కుంజ్ అడవుల్లో కూంబింగ్‌కు వెళ్లిన డీఆర్టీ, సీఆర్పీఎఫ్, ఎస్టీఎఫ్ జవాన్లు టార్గెట్‌గా చేసుకుని మావోయిస్టులు కాల్పులు జరిపారు. జవాన్లు ఎదురు దాడికి దిగి కాల్పులు జరపడంతో మావోయిస్టులు అడవుల్లోకి వెళ్లిపోయారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. దీంతో మావోయిస్టుల కదలికలపై అలర్ట్‌గా ఉన్నట్లు బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ చెప్పారు.

Next Story