మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్‌

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహిళలకు బిహార్ ప్రభుత్వం (Bihar Government) తీపి కబురు చెప్పింది.

మహిళలకు భారీ గుడ్ న్యూస్.. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్‌
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మహిళలకు బిహార్ ప్రభుత్వం (Bihar Government) తీపి కబురు చెప్పింది. సీఎం నితీశ్ కుమార్ (CM Nitish Kumar) అధ్యక్షతన ఇవాళ నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిసైడ్ చేశారు. అయితే, ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైన మహిళలు రాష్ట్రానికి చెందిన వారై ఉండాలి. ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారికి ఇది వర్తించదని తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలోని దివ్యాంగుల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (BPSC), యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ కోసం సిద్ధం అయ్యేందుకు రూ.50 వేలు (బీపీఎస్సీ) రూ.లక్ష (యూపీఎస్సీ) అభ్యర్థులకు ప్రోత్సాహకాలను అందజేసేందుకు ఆమోదం తెలిపారు. అదేవిధంగా బీహార్ ఫుడ్ సెక్యూరిటీ సంపర్క నియమావళి-2025కి ఓకే చెప్పారు. అంబేడ్కర్ రెసిడెన్షియల్ స్కూల్ కోసం రూ.65 కోట్ల నిధులు, జీవిక దీదీ బ్యాంక్ కోసం రూ.105 కోట్లు మంజూరే చేసేందుకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.

Next Story