- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అతిపెద్ద మురికివాడలో భారీ అగ్నిప్రమాదం.. వందలాది నివాసాలు బూడిద
by Muthe.Rajitha |
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అతిపెద్ద మురికివాడలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది.

X
దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని అతిపెద్ద మురికివాడలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఢాకాలోని కొరైల్ స్లమ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించి, వందలాది పేదల ఇళ్ళు కాలి బూడిద అయ్యాయి. మొదట ఒక చెత్త కుప్పలో అంటుకున్న మంటలు వేగంగా వ్యాపించి వందలాది గుడిసెలు తగలబడి, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. దట్టమైన పొగ ఆ ప్రాంతాలను కమ్మేసింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ మరణించలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Next Story






