- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పోలీస్ స్టేషన్ సమీపంలో భారీ పేలుడు.. హుటాహుటిన జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి మరువక ముందే.. జమ్మూ కాశ్మీర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం భారీ పేలుడు సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి మరువక ముందే.. జమ్మూ కాశ్మీర్‌లోని నౌగాం పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం భారీ పేలుడు (Huge explosion) సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ‘వైట్ కాలర్’ టెర్రర్ మాడ్యూల్ కేసు(Terror Module Case)లో స్వాధీనం చేసుకున్న భారీ పేలుడు పదార్థాల నుంచి నమూనాలు తీసే ప్రక్రియలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద తీవ్రత వల్ల 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 27 మందికి గాయాలు అయ్యారు. పేలుడు తీవ్రత భారీగా ఉండటంతో పరిసర ప్రాంతాలు ఒక్కసారిగా కుదిపేశాయి.
ఈ ఘటన సమాచారం అందిన వెంటనే స్థానిక అధికారులకు ఫోన్ చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home Minister Amit Shah).. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని ఆదేశించారు. అలాగే ఈ రోజు సాయంత్రం జమ్మూ కశ్మీర్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. నౌగాంలో పేలుడు సంబవించిన పోలీస్ స్టేషన్ ప్రదేశాన్ని అమిత్‌షా పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.






