- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 50 మంది దుర్మరణం
పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది.

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో భారీ పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో 50 మంది పౌరులు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. వందల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు సహాయక చర్యలు మొదలెట్టాయి. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఇస్లామాబాద్‌లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అయితే ఇప్పటివరకు బాధ్యులుగా ఎవరు ప్రకటించలేదు. ఇదిలావుంటే, మూడు నెలల క్రితం, నవంబర్ 11, 2025న, ఇస్లామాబాద్‌లోని G-11 ప్రాంతంలోని జిల్లా, సెషన్స్ కోర్టు భవనం వెలుపల ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. ఆ పేలుడులో 12 మంది మరణించగా, 30 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం పాకిస్తాన్‌ను ఉగ్ర భూతం నీడలా వెంటాడుతోంది. ఆ దేశంలో ముష్కరులు సృష్టిస్తున్న రక్తపాతం అంతా ఇంతా కాదు. ఈ విపత్తును అరికట్టేందుకు పాకిస్తాన్ భద్రతా దళాలు క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాయి. పాక్ సైన్యం 'ఇంటెలిజెన్స్ ఆధారిత ఆపరేషన్లను' (IBO) వేగవంతం చేసింది. తాజాగా జరిగిన బ్లాస్టింగ్ కూడా ఉగ్రమూకల పనే అయి ఉండొచ్చని పాక్ భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి.






