ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించిన పాకిస్తాన్ ప్రభుత్వం

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-06 13:26:34  IST  )

పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామాబాద్ లోని షియా మసీదు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మ‌ర‌ణించారు. మ‌రో 80 మంది గాయ‌ప‌డ్డారు.

ఇస్లామాబాద్‌లో ఎమర్జెన్సీ విధించిన పాకిస్తాన్ ప్రభుత్వం
X

దిశ‌, వెబ్ డెస్క్: పాకిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. ఇస్లామాబాద్ లోని షియా మసీదు లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 15మంది మ‌ర‌ణించారు. మ‌రో 80 మంది గాయ‌ప‌డ్డారు. షెహ్జాద్ టౌన్ లోని మ‌సీద్ వ‌ద్ద ఈ దాడి జ‌రిగింది. ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొన‌సాగుతుండ‌గా ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఇస్లామాబాద్ లో ఎమర్జెన్సీ ప్ర‌క‌టించింది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. నివేదిక‌ల ప్ర‌కారం పేలుడు జ‌రిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు ప్రారంభించాయి. గాయ‌ప‌డిన‌వారిని పాలిక్లీనిక్ హాస్పిట‌ల్, పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆస్పత్రికి తరలించాయి. మరోవైపు పేలుడు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. ఇస్లామాబాద్ లో హైఅలర్ట్ ప్రకటించాారు. ముఖ్యమైన ప్రదేశాలలో భద్రతా సిబ్బంది విస్తృత త‌నిఖీలు చేయ‌ప‌డుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు, బాంబ్ స్వ్కాడ్ రంగంలోకి దిగి పేలుడు ప్ర‌దేశాన్ని ప‌రిశీలిస్తున్నాయి.

పాకిస్తాన్‌లో భారీ పేలుడు.. 50 మంది దుర్మరణం

Next Story