బాంబుల మోతతో మరోసారి దద్దరిల్లిన ఇరాన్.. ఎటాక్ చేస్తామని ముందే హెచ్చరించిన ఇజ్రాయెల్

by Gantepaka Srikanth |

బాంబుల మోతతో ఇరాన్ మరోసారి దద్దరిల్లింది. అమెరికా, ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న నిరసన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది.

బాంబుల మోతతో మరోసారి దద్దరిల్లిన ఇరాన్.. ఎటాక్ చేస్తామని ముందే హెచ్చరించిన ఇజ్రాయెల్
X

దిశ, వెబ్‌డెస్క్: బాంబుల మోతతో ఇరాన్ మరోసారి దద్దరిల్లింది. అమెరికా, ఇజ్రాయెల్ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జరుగుతున్న నిరసన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడును ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ ధృవీకరించింది. ఈ పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, ఈ ఘటనకు కొద్ది నిమిషాల ముందే సదరు ప్రాంతంపై తాము దాడి చేసే అవకాశం ఉందని ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. పాలస్తీనియన్లకు మద్దతుగా ఇరాన్ ఏటా నిర్వహించే 'ఖుద్స్ డే' ర్యాలీలు ప్రారంభం కావడానికి సరిగ్గా ముందు, టెహ్రాన్ పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన వైమానిక దాడులు మొదలయ్యాయి. ఒకవైపు బాంబుల మోత వినిపిస్తున్నప్పటికీ, వేలాది మంది ప్రజలు వెనక్కి తగ్గకుండా వీధుల్లోకి వచ్చారు. ఈ సందర్భంగా నిరసనకారులు ఇజ్రాయెల్ మరియు అమెరికాకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నినాదాలు చేశారు. పేలుడు ధాటికి పదుల సంఖ్యలో మరణించి ఉంటారని భద్రతా బలగాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

Next Story