- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Huge Encounter: కర్రిగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 38 మంది మావోయిస్టులు మృతి
చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో కర్రిగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగారు’ ముమ్మరంగా కొనసాగుతోంది.

దిశ, వెబ్‌డెస్క్: చరిత్రలోనే కనివిని ఎరుగని రీతిలో కర్రిగుట్టలే లక్ష్యంగా భద్రతా దళాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ ముమ్మరంగా కొనసాగుతోంది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా ధర్మ తాళ్లగూడెం కర్రిగుట్టలు మావోయిస్ట్ మోస్ట్ వాంటెడ్ నేతలతో పాటు మావోయిస్టు సాయుధ విభాగమైన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వేయ్యి మందికిపైగా సభ్యులు సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారం భద్రతా దళాలకు అందింది. దీంతో అలర్ట్ అయిన వారు గత వారం రోజులుగా కర్రిగుట్ట (Karrigutta)ను టార్గెట్‌గా చేసుకుని దాదాపు 5,500 మందితో డీఆర్‌జీ బస్తర్ ఫైటర్ కోబ్రా (DRG Bastar Fighter Cobra), సీఆర్‌పీఎఫ్ (CRPF), ఎస్టీఎఫ్ (STF) సైనికులు భారీ కూంబింగ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాయి. ముఖ్యంగా హెలికాప్టర్లు, అత్యాధునిక టెక్నాలజీ కలిగిన డ్రోన్లతో అడవిలో అణువణువు గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ జరగిన ఎదురుకాల్పుల్లో సుమారు 38 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది. కానీ, మావోయిస్టుల మృతిపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మావోయిస్టుల కీలక లేఖ..
కర్రిగుట్టల్లో కూంబింగ్ కొనసాగుతోన్న వేళ శుక్రవారం మధ్యాహ్నం బస్తర్ మావోయిస్టులు ఇంచార్జ్ పేరిట సంచలన లేఖ విడుదలైంది. ఆ లేఖలో ‘ఆపరేషన్ కగార్’ను వెంటనే నిలిపివేసి శాంతి చర్చలకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. శాంతి చర్చలతో సమస్య పరిష్కారం అవుతోందని తాము భావిస్తున్నామని అన్నారు. శాంతి చర్చల విషయంలో తమ పార్టీ కేంద్ర కమిటీ ఇప్పటికే లేఖలు విడుదల చేసిందని గుర్తు చేశారు. కానీ, కేంద్రం మావోయిస్టులపై యుద్ధం ప్రకటించి తుదముట్టించేందుకు పూనుకుందని ఆరోపించారు. ఛత్తీస్‌గఢ్ -తెలంగాణ సరిహద్దులో కూంబింగ్‌తో పాటు ‘ఆపరేషన్ కగార్’ను నెల రోజుల పాటు వాయిదా వేయాలని ఆ లేఖలో ప్రస్తావించారు.






