- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో అధిక ధరలకు అమ్మితే ఇలా కంప్లైంట్ చేయండి
రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సూపర్ మార్కెట్లలో ఏదైనా వస్తువును దానిపై ఉన్న MRP కంటే అధిక ధరలకు..

దిశ, వెబ్‌డెస్క్: రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, సూపర్ మార్కెట్లలో ఏదైనా వస్తువును దానిపై ఉన్న MRP కంటే అధిక ధరలకు విక్రయించడం షరా మామూలైపోయింది. అదేమంటే తమకు రెంట్ ఛార్జీలు, కూల్ డ్రింక్స్, వాటర్ బాటిల్స్, ఇతర ఫిడ్జ్ స్టోరేజ్ ఐటెమ్స్ పై కూలింగ్ ఛార్జీలు ఉంటాయని చెప్తుంటారు. ఇటీవల సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాం వద్ద, స్టేషన్ బయట ఉన్న షాపుల్లో లేస్ ప్యాకెట్లు, కూల్ డ్రింక్ బాటిళ్లను MRP పై రూ.3 నుంచి రూ.5 మేర అదనపు రేట్లకు అమ్మడం మొదలు పెట్టారు. అదేమని ప్రశ్నించిన కస్టమర్ ను కొంటే కొను, లేదంటే లేదు అని దురుసు సమాధానమిస్తున్నారు. దీనిపై కంప్లైంట్ చేస్తామని అంటే.. చేస్తే చేస్కో అని ధీమా వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
కొందరు కస్టమర్లు ఏదో వాళ్లకీ ఒక రూపాయి వస్తుంది కదా అని చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. ఇలాగే కొనసాగితే ఇదొక దందాలా మారుతుందని సామాన్యులు అంటున్నారు. అందుకే నేషనల్ కన్స్యూమర్ ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేసేందుకు ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేసింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, సూపర్ మార్కెట్స్ వంటి ప్రాంతాల్లో MRP కంటే అధిక రేట్లకు వస్తువుల్ని అమ్మితే.. వాటిపై ప్రశ్నించడం వినియోగదారుడి హక్కు అని NCH చెప్తోంది. అధిక ధర వసూలు చేయడం చట్ట ప్రకారం నేరం. ఇలాంటి మోసాలపై వెంటనే నేషనల్ కన్య్సూమర్ హెల్ప్ లైన్ నంబర్ 1915కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదా వాట్సాప్ నంబర్ 8800001915కు మెసేజ్ చేసి కంప్లైంట్ చేయవచ్చు అని నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ చెప్తోంది.






