మీ ఊరికి ఎన్ని నిధులొచ్చాయ్? వాటిని ఏం చేశారు? ఇలా తెలుసుకోండి

by Naga Rani Yarlagadda |

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకం కింద మీ ఊరికి ఎన్ని నిధులొచ్చాయి?

మీ ఊరికి ఎన్ని నిధులొచ్చాయ్? వాటిని ఏం చేశారు? ఇలా తెలుసుకోండి
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకం కింద మీ ఊరికి ఎన్ని నిధులొచ్చాయి? వాటిని ఏయే పనులకోసం ఖర్చు చేశారు? ఇంకా ఎన్ని నిధులు మిగిలి ఉన్నాయి. ఈ సమాచారాన్ని మీరు కూడా తెలుసుకోవచ్చు. అది కూడా మీ ఫోన్ ద్వారానే సెకన్లలో తెలుసుకోవచ్చు.

కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ 2020లో eGramSwaraj అనే యాప్ ను తీసుకొచ్చింది. ఈ యాప్ ను ఓపెన్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, గ్రామాన్ని సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి. నెక్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్ అని లెఫ్ట్ సైడ్ పైన చూపిస్తుంది. అక్కడ ఏ ఆర్థిక సంవత్సరం నిధులు, వాటి ఖర్చులు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ ఆర్థిక సంవత్సరాన్ని సెలెక్ట్ చేసి, అప్రూవ్డ్ యాక్టివిటీస్ పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు మీ ఊరికి ఎన్ని నిధులు కేటాయించారు? వాటిని ఎన్ని పనులకు, ఎంతెంత చొప్పున వాడారు? చూపిస్తుంది. డీటెయిల్స్ లో ఆ పనుల వివరాలు ఉంటాయి. కొన్ని గ్రామాల పేర్లపై ఈ డీటెయిల్స్ కనిపించకపోతే వెనక్కి వెళ్లి ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ పై క్లిక్ చేయాలి. ఏ స్కీమ్ ద్వారా మీ ఊరికి ఎంత నిధులు సమకూరాయి? వాటిలో ఎంత ఖర్చు చేశారు ? అన్న విషయాలు తెలుసుకోవచ్చు.

Next Story