‘సెక్స్ వార్‌ ఫేర్’.. వెన్నులో వణుకుపుట్టిస్తున్న రష్యా, చైనా స్పై

by Prasad Jukanti |   (  Updated:2025-10-23 11:10:26  IST  )

యుద్ధ రంగంలో శత్రు రహస్యాలు అత్యంత కీలకం.

‘సెక్స్ వార్‌ ఫేర్’..  వెన్నులో వణుకుపుట్టిస్తున్న రష్యా, చైనా స్పై
X

దిశ, డైనమిక్ బ్యూరో: యుద్ధ రంగంలో శత్రు రహస్యాలు అత్యంత కీలకం. పై చెయి సాధించేందుకు ప్రత్యర్థుల బలహీనతలపై నిరంతరం దృష్టి సారించడం సాధారణ విషయమే. వ్యాపారం, రాజకీయంలోనూ ఇదే సూత్రం. అయితే ప్రత్యర్థుల సీక్రెట్స్ తెలుసుకునేందుకు కాలంతో పాటు అనేక కొత్త కొత్త పద్ధతులు తెరపైకి వస్తున్నాయి. డబ్బు, సుఖభోగాలతో మరికొందరిని ట్రాప్‍లో వేసుకోవడం మనందరికి తెలిసిందే. అయితే సాంకేతికత మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా ఉన్న యూఎస్ లోని సిలికాన్ వ్యాలీలో (Silicon Valley) ఇప్పుడు ‘సెక్స్ వార్ ఫేర్’ అనేది అక్కడి టెక్ కంపెనీల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఆయా టెక్ సంస్థల రహస్యాలను తెలుసుకునేందుకు చైనా, రష్యా ఈ సెక్స్ వార్ ఫేర్‍కు (Sex warfare) తెరలేపినట్లు తాజాగా కథనాలు వెలువడుతున్నాయి.

వలపులతో మొదలు పెట్టి పెళ్లి.. పిల్లల వరకు..

హనీ ట్రాప్‍లో ఆకర్షనీయమైన అమ్మాయిలు తమ అందచందాలను విసిరి తమకు కావాల్సిన రహస్యాలను లేదా డబ్బులను డిమాండ్ చేయడం ఆ తర్వాత కనిపించకుండా పోవడం చూస్తూనే ఉంటాం. కానీ తాజాగా చైనా, రష్యన్ ఆపరేటర్లు టెక్ కంపెనీల రహస్యాల కోసం ఆయా సంస్థల్లో పని చేసే ఉద్యోగులను ప్రలోభపెట్టడానికి అందమైన మహిళలను ఉపయోగించుకుంటున్నట్లు తాజాగా వెల్లడైంది. ఈ క్రమంలో దీర్ఘకాలిక స్పై కోసం తాము లక్ష్యంగా చేసున్న వారిని పెళ్లి చేసుకోవడమే కాదు కాదు ఏకంగా వారితో పిల్లల్ని సైతం కంటున్నారని నిఘా నిపుణులు గుర్తించారు. సెక్స్ వార్ ఫేర్ గా పిలుస్తున్న ఈ తతంగం యూఎస్ టెక్ ఆధిపత్యానికి ముప్పుగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో పెట్టుబడులు పెట్టే అమెరికా కంపెనీలకు సలహా ఇచ్చే పామిల్ కన్సల్టింగ్ చీఫ్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ జేమ్స్ మల్వేనాన్ ఈ తరహా ట్రాప్‍ను స్వయంగా చూశానని చెప్పినట్లు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఆకర్షణీయమైన యువతి నుంచి తనకు చాలా అధునాతన లింక్డ్ ఇన్ అభ్యర్థనులు వస్తున్నాయని ఇది ఇటీవల బాగా పెరిగినట్లు చెప్పుకొచ్చారు. ఇటీవల చైనా పెట్టుబడి నష్టాలపై వర్జీనియాలో జరిగిన వ్యాపార సమావేశంలో ఇద్దరు అందమైన చైనీస్ మహిళలు ప్రవేశించడానికి ప్రయత్నించగా వారిని గుర్తించి లోపలికి అనుమతించలేదని ముల్వెనాన్ చెప్పారు. ఈ ఈవెంట్‍కు సంబంధించిన మిగతా అంతా ఇన్ఫర్మేషన్ వారి వద్ద ఉండటం ఆందోళన కలిగించే విషయం.

అయితే లైంగిక ఆధారిత గూఢచర్యం ముప్పు చాలా కాలంగా ఉన్నదే అయినప్పటికీ వ్యాపార ప్రణాళికలను సేకరించేందుకు చైనా అమెరికా గడ్డపై స్టార్టప్ పోటీలను నిర్వహిస్తోందని, చైనా, రష్యా సాధారణ పౌరులు, పెట్టుబడిదారులు, విద్యావేత్తలు, క్రిప్టో విశ్లేషకులను అనధికారిక నిఘా ఏజెంట్లుగా ఉపయోగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి వారి కార్యకలాపాలను గుర్తించడం కష్టతరంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సున్నితమైన ప్రాజెక్టులలో భాగస్వామ్యం ఉన్న అమెరికన్ ఏరోస్పేస్ ఇంజనీర్‍ను ఓ రష్యన్ మహిళా ఇదే రకంగా వివాహం చేసుకుందని ముల్వెనాన్ వివరించారు.
Next Story