నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తాం?.. బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీ ఘాటు స్పందన

by Yella Dhawani Reddy |

బిహార్‌లో (Bihar) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి.

నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తాం?.. బిహార్ ఓటర్ల జాబితాపై ఈసీ ఘాటు స్పందన
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్‌లో (Bihar) చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision - SIR) పై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. అసలైన ఓటర్లను తొలగించి, నకిలీ ఓటర్లను చేర్చే కుట్ర జరుగుతోందంటూ వారు ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం (ECI) తాజాగా ఘాటుగా స్పందించింది. నకిలీ ఓటర్లను ఎలా అనుమతిస్తామని ప్రశ్నిస్తూ, ఓటరు జాబితా సవరణ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, నియమాల ప్రకారం జరుగుతోందని స్పష్టం చేసింది.

ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. 'ఓటరు జాబితా పరిశుద్ధతను కాపాడటమే మా ప్రాధాన్యత. సవరణ ప్రక్రియలో నిబంధనలకు అనుగుణంగా తగిన ప్రమాణాలు పాటిస్తున్నాం. ప్రజలు తమ వివరాలను తనిఖీ చేసుకోవచ్చు, తప్పులుంటే అభ్యంతరాలు కూడా నమోదు చేయవచ్చు' అని ఆయన పేర్కొన్నారు. బిహార్‌లో 7.9 కోట్ల ఓటర్లలో 52 లక్షల మందిని తొలగించారు, ఇందులో చనిపోయినవారు (18 లక్షలు), వలస వెళ్ళినవారు (26 లక్షలు), బహుళ గుర్తింపులు కలిగినవారు (7.5 లక్షలు) ఉన్నారని, ఈ ప్రక్రియ పారదర్శకంగా 1 లక్ష బూత్ లెవెల్ ఆఫీసర్లు, 4 లక్షల వాలంటీర్లతో జరుగుతోందని జ్ఞానేశ్ కుమార్ తెలిపారు. కాగా, ఆగస్టు 1 నుంచి సెప్టెంబరు 1 వరకు అభ్యంతరాల సమర్పణకు అవకాశం ఉంది. తుది జాబితా సెప్టెంబరు 30న వెలువడుతుంది.

Next Story