Indian Defense Mechanism: న్యూక్లియర్ బాంబులను సైతం తుస్సు మనిపించే..ఇండియన్ డిఫెన్స్ మెకానిజం ఇదే.. ఆటం బాంబు భయం లేదు

by Vennela |   ( Updated:2025-05-09 10:39:45.0  )
Indian Defense Mechanism: న్యూక్లియర్ బాంబులను సైతం తుస్సు మనిపించే..ఇండియన్ డిఫెన్స్ మెకానిజం ఇదే.. ఆటం బాంబు భయం లేదు
X

దిశ, వెబ్ డెస్క్: Indian Defense Mechanism: భారత్ పాకిస్తాన్ మధ్య యుధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అందరి దృష్టి ఈ ఇరుదేశాలు తయారు చేసుకున్న అణు బాంబులపైనే పడ్డాయి. ఎందుకంటే ఇరుదేశాలు కూడా న్యూక్లియర్ వెపన్స్ కలిగి ఉన్నాయి. రెండు న్యూక్లియర్ శక్తులు తలపడితే ఆసియాలో వినాశనం తప్పదని అటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్నాయి. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో అమెరికా జపాన్ కు చెందిన హీరోషిమా నాగసాకి అనే నగరాలపై తొలిసారిగా న్యూక్లియర్ బాంబులను వేసింది.

ఈ బాంబుల ధాటికి ఆ నగరాలు పూర్తిగా విధ్వంసం అయిపోయాయి. ఆ విధ్వంసం నుంచి జపాన్ తీరుకునేందుకు కొన్ని దశాబ్దాలు పట్టింది. అమెరికా వేసిన అణుబాంబు ధాటికి హిరోషిమా, నాగసాకి నగరాలు పూర్తిగా మాడి మసైపోయాయి. బాంబు అనంతరం వెలువడిన రేడియేషన్ దెబ్బకు కొన్ని తరాలపాటు అక్కడ మనుషులతో పాటు జంతు జీవజాలాలు అన్నీ కూడా అంగవైకల్యంతో పుట్టాయి. అప్పటినుంచి ప్రపంచ దేశాలన్నీ కూడా న్యూక్లియర్ వార్ అంటేనే వణుకుతున్నాయి.. అయితే భారత్ వద్ద మాత్రం అయితే భారత్ మాత్రం న్యూక్లియర్ ఎటాక్ ను సైతం ఎదుర్కొనే రక్షణ వ్యవస్థను కలిగి ఉంది. అందుకోసం ఇండియన్ ఆర్మీ వద్ద ఉన్న న్యూక్లియర్ అటాక్ డిఫెన్స్ సిస్టం ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

భారతదేశం వద్ద ఉన్న అణు వ్యతిరేక క్షిపణి రక్షణ వ్యవస్థలు ఇవే:

పృథ్వీ డిఫెన్స్ వెహికల్ (PDV):

ఇది బాలిస్టిక్ క్షిపణులను 40,000 అడుగుల ఎత్తులోనే నాశనం చేయగలదు.

అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ (AAD):

నేలకు తక్కువ ఎత్తులో వచ్చే క్షిపణులను గాల్లోనే నాశనం చేస్తుంది.

బరాక్-8:

DRDO, ఇజ్రాయెల్ కలిసి అభివృద్ధి చేసిన మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టం.ఇది యుద్ధ విమానాలు, డ్రోన్లు, సూపర్‌సోనిక్ క్షిపణులను అడ్డుకునే సామర్థ్యం ఉంది.

స్వోర్డ్‌ఫిష్ రాడార్ :

బాలిస్టిక్ మిసైళ్లు 600 కి.మీ వరకు ట్రాక్ చేయగల రాడార్ వ్యవస్థగా పేరు పొందింది.

9K33 OSA-AK :

ఇది షార్ట్ రేంజ్ క్షిపణి రక్షణ వ్యవస్థ, 15–18 కి.మీ పరిధిలో పని చేస్తుంది.

S-400 ట్రయంఫ్ :

ఇది భారత్ వద్ద ఉన్న గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. రష్యా తయారు చేసిన ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థ, 400 కి.మీ వరకు వచ్చే టార్గెట్ క్షిపణులు ఎదుర్కొని దెబ్బతీస్తుంది.



Next Story

Most Viewed