యుద్ధంలోకి మరోదేశం ఎంట్రీ.. ఎర్రసముద్ర మార్గం ఇక కష్టమేనా?

by Prasad Jukanti |

ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలోకి యెమెన్ హౌతీలు ఎంట్రీ ఇచ్చారు. తాజాగా జరిగిన మిసైల్ దాడితో ఎర్రసముద్రం రవాణా మార్గంలో టెన్షన్ మొదలైంది.

యుద్ధంలోకి మరోదేశం ఎంట్రీ.. ఎర్రసముద్ర మార్గం ఇక కష్టమేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మొదలైన యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. యుద్ధరంగంలోకి మరో దేశం ఎంటర్ అయినట్లు తెలుస్తోంది. తాజాగా యెమన్ నుంచి ప్రయోగించిన మిసైల్‍‍ను గగణతలంలోనే అడ్డుకున్నట్లు ఇజ్రాయెల్ రక్షణ దళం(IDF) వెల్లడించింది. ఇరాన్ మద్దతుదారుగా ఉన్న హౌతీ తిరుగుబాటు గ్రూప్ ఈ క్షిపణిని ఇజ్రాయెల్‍పై కి ప్రయోగించింది. 2014 నుంచి యెమెన్ రాజధాని సనా నగరాన్ని హౌతీలు తమ నియంత్రణలో ఉంచుకున్నారు. యుద్ధం ప్రారంభమైన తర్వాత యెమెన్ నుంచి జరిగిన తొలి దాడి ఇదే కావడంతో పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల్లోకి తాజాగా యెమన్ కూడా చేరినట్లు కనిపిస్తోంది.

ఎర్రసముద్రం వద్ద కొత్త టెన్షన్:

యుద్ధం కారణంగా హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే భారత్ సహా అనేక దేశాలు తీవ్రంగా చమురు, గ్యాస్ సమస్యలతో పాటు ఇతర ఎగుమతులు, దిగుమతులపై ప్రభావాన్ని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హౌతీలు సైతం యుద్ధరంగంలోకి దిగితే ఎర్రసముద్రం రవాణా మార్గం గుండా ప్రయాణించే వాణిజ్య నౌకలకు ముప్పు తప్పదనే చర్చ జరుగుతోంది. ఈ ఎర్రసముద్రం గుండా ప్రతి యేడాది సుమారు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన సరుకులు రవాణా అవుతాయి. ఇదే మార్గం గుండా ఇజ్రాయెల్ దిగుమతుల్లో సుమారు 30 శాతం రవాణా జరుగుతుంది. ఇలాంటి ఎర్రసముద్రంపై హౌతీలు ఇటీవల తరచూ దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంలో మరింత దూకుడుగా ముందుకు వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయానేది వేచి చూడాలి.

Next Story