- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Houthi rebels: యెమెన్ పై అమెరికా వైమానిక దాడులు.. 68 మంది మృతి
యెమెన్ (Yemen)లోని హౌతీ రెబల్స్- అమెరికా(USA) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్, అమెరికా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: యెమెన్ (Yemen)లోని హౌతీ రెబల్స్- అమెరికా(USA) మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హౌతీ రెబల్స్, అమెరికా మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఈక్రమంలోనే యెమెన్‌లోని ఒక జైలుపై అగ్రరాజ్యం జరిపిన వైమానిక దాడుల్లో 68 మంది చనిపోయారని హౌతీలు పేర్కొన్నారు. మరో 47 మంది గాయపడినట్లు వెల్లడించారు. యెమెన్‌లో సాదా గవర్నరేట్స్‌లో అమెరికా వైమానిక దాడులు చేసిందని హౌతీలు తెలిపారు. ఆఫ్రికన్ వలసదారులు ఉన్న జైలుపై ఈ దాడి జరిగిందన్నారు. ఇందులో 68 మంది మరణించారని వెల్లడించారు. ఈ జైలులో 115 మంది ఖైదీలు ఉన్నట్లు అక్కడి మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, ఈ దాడి పైన అమెరికా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు, యెమెన్ రాజధాని సనాలోనూ వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా.. మార్చి నుంచి ఇప్పటివరకు యెమెన్‌పై జరిపిన దాడుల్లో 800కు పైగా లక్ష్యాలని ఛేదించినట్లు అమెరికా ప్రకటించింది. అంతేకాక వందల మంది హౌతీలు హతమయ్యారని మిలిటరీ కమాండ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ దాడుల్లో తిరుగుబాటుదారులకు చెందిన వాయు రక్షణ వ్యవస్థలు, అధునాతన ఆయుధాల తయారీ సౌకర్యాలు, నిల్వ స్థావరాలు నాశనం అయ్యాయని వెల్లడించింది. ఈసందర్భంగా తమ లక్ష్యం నెరవేరే వరకు హౌతీలపై ఇలాంటి దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది.






