Housing jihad: ముంబైలో ‘హౌసింగ్ జిహాద్’ జరుగుతోంది.. శివసేన నేత సంచలన వ్యాఖ్యలు

by B.Srinivas |

లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్ తర్వాత మహారాష్ట్రలో హౌసింగ్ జిహాద్ అనే కొత్త పదం వెలుగులోకి వచ్చింది.

Housing jihad: ముంబైలో ‘హౌసింగ్ జిహాద్’ జరుగుతోంది.. శివసేన నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: లవ్ జిహాద్ (Love jihad) , ల్యాండ్ జిహాద్ (Land jihad) తర్వాత మహారాష్ట్రలో హౌసింగ్ జిహాద్ (Housing jihad) అనే కొత్త పదం వెలుగులోకి వచ్చింది. దేశ ఆర్థిక రాజధానిలో ముస్లిం రియల్ ఎస్టేట్ డెవలపర్లు ‘హౌసింగ్ జిహాద్’ నిర్వహిస్తున్నారని శివసేన నేత సంజయ్ నిరుపమ్ (Sanjay nirupam) వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముంబైలోని మురికివాడల పునరావాస ప్రాజెక్టులలో ముస్లిం రియల్టర్లు పాల్గొంటున్నారని, వారి కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల పేర్లను లబ్ధిదారుల జాబితాలో చేర్చి నగర జనాభాను మారుస్తున్నారని ఆరోపించారు. ముంబైలోని పశ్చిమ శివారు ప్రాంతాలు, గోవండి, మన్ఖుర్డ్, కుర్లా, సాకి నాకా, బాంద్రా వంటి ఇతర ప్రాంతాల్లో ఇటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు.

‘600 మురికివాడల పునరావాస సంస్థ (ఎస్ఆర్ఏ) ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. వాటిలో 10 శాతం ముస్లిం బిల్డర్లే ఉన్నారు. అందరూ అలాంటి పనుల్లో పాల్గొంటున్నారు. నగర జనాభాను పెద్ద ఎత్తున మార్చడమే వారి ప్రణాళిక. ఇది హౌసింగ్ జిహాద్ కిందకే వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కొన్ని గృహనిర్మాణ ప్రాజెక్టులలో జరిగిన మోసపూరిత కార్యకలాపాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండేకు లేఖ రాసినట్టు స్పష్టం చేశారు. ఓషివారాలో రెండు గృహనిర్మాణ ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయని, హిందూ మెజారిటీ సమాజాన్ని ముస్లిం మెజారిటీ సమాజంగా మార్చారని ఆరోపించారు.

Next Story