వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు, 160 మంది గల్లంతు (వీడియో)

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-07-10 09:32:41  IST  )

అమెరికాలోని టెక్సాస్ లో సంభవించిన మెరుపు వరదలు బీభత్సం (Texas Flash Floods) సృష్టిస్తున్నాయి.

వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు, 160 మంది గల్లంతు (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలోని టెక్సాస్ లో సంభవించిన మెరుపు వరదలు బీభత్సం (Texas Flash Floods) సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకూ వరదల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 100 దాటగా.. మరో 160 మంది గల్లంతైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. వరదల వల్ల టెక్సాస్ లో 109 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 160 మంది ప్రజల ఆచూకీ తెలియరాలేదని గవర్నర్ గ్రెగ్ అబాట్ వెల్లడించారు. మరోవైపు మెక్సికోలోని రుయిడోసో (Ruidoso Floods)లో కూడా ఆకస్మిక వరదలు సంభవించడంతో యూఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ ఎమర్జెన్సీ ప్రకటించింది. వరద ప్రవాహంలో ఇళ్లు కొట్టుకుపోగా.. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

కాగా.. రుయిడోసోలో వరదల కారణంగా ఇప్పటివరకూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఎవరికీ గాయాలు కాలేదని మేయర్ లిన్ క్రాఫోర్డ్ పేర్కొన్నారు. నది 20 అడుగుల కంటే ఎత్తులో ప్రవహిస్తుండటంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. టెక్సాస్‌‌లో గ్వాడలూప్ నదిపరివాహక (Guadalupe River) ప్రాంతంలో సమ్మర్ క్యాంప్‌కు వెళ్లినవారిలో ఎంతమంది గల్లంతయ్యారన్నదానిపై స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు.

Next Story