- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Zelensky : జెలెన్ స్కీ తీరుపై రిపబ్లికన్ సెనేటర్ తీవ్ర విమర్శలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీల(Volodymyr Zelenskyy) మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump), ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్‌స్కీల(Volodymyr Zelenskyy) మధ్య జరిగిన వాగ్వాదం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, జెలెన్ స్కీపై ఓ రిపబ్లికన్ సెనేటర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామానికి ముందే జెలెన్ స్కీని హెచ్చరించినట్లు వెల్లడించారు. ట్రంప్‌తో భేటీకి ముందు.. రిపబ్లికన్, డెమోక్రటిక్ సెనెటర్లతో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. అయితే, ఆ సమయంలోనే జెలెన్ స్కీకి రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పలు సూచనలు చేశారు. లిండ్సే గ్రాహమ్ మాట్లాడుతూ.. ‘‘ అనవసరంగా ట్రంప్ తో వాగ్వాదానికి దిగొద్దు. అయన సంబంధాల పునరుద్ధరణ కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు’’ అని చెప్పారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో సెనేటర్ వెల్లడించారు. అయితే, అన్ని సూచనలు చేసినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులంతా గందరగోళంగా మారాయన్నారు. ఓవెల్ ఆఫీస్ లో జెలెన్ స్కీ ప్రవర్తన అమర్యాదగా కన్పించిందని లిండ్సే పేర్కొన్నారు. జెలెన్ స్కీ తీరు చూసి అమెరికన్లు.. ఆయనతో మరోసారి సంప్రదింపులు జరిపేందుకు ఇష్టపడరని చెప్పుకొచ్చారు. జెలెన్‌స్కీ రాజీనామా చేయాలా? అన్న ప్రశ్నకు లిండ్సే బదులిచ్చారు. ఆయన రాజీనామా చేసి సామరస్య చర్చలు జరిపే వ్యక్తిని పంపాలన్నారు. లేదంటే జెలెన్ స్కీ తీరులో మార్పు వస్తేనే చర్చలు ముందుకు సాగుతున్నాయన్నారు.
శాంతి ఒప్పందంలో వాగ్వాదం
రష్యా దండయాత్రను ముగించేందుకు శాంతి ఒప్పందం కుదర్చడం, దానికి బదులుగా ఉక్రెయిన్‌లోని అరుదైన ఖనిజాల తవ్వకానికి అనుమతించాలని వాషింగ్టన్ చేసిన ప్రతిపాదనపై చర్చించడానికి జెలెన్‌స్కీ శుక్రవారం వైట్ హౌజ్ వచ్చారు. భవిష్యత్తులో తమపై రష్యా ఏదైనా దుశ్చర్యకు పాల్పడితే రక్షణ కల్పించాలని జెలెన్ స్కీ అమెరికాపై ఒత్తిడి చేశారు. దీంతో, ట్రంప్ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో చర్చలు అర్ధంతరంగా ముగిసిపోయాయి. ఒప్పందంపై ఎలాంటి సంతకాలు చేయకుండానే జెలెన్‌స్కీ వైట్‌హౌస్ నుంచి వెళ్లిపోయారు. అమెరికా, ఉక్రెయిన్ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ మీడియా ఎదుటే వాగ్వాదానికి దిగడంతో ప్రపంచమంతా ఆశ్చర్యానికి గురయ్యింది. మరోవైపు, జెలెన్‌స్కీ వ్యవహరించిన తీరుపై రిపబ్లికన్ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ, ఈయూ నేతలు, కెనడా, ఫ్రాన్స్ దేశాధినేతలు ఉక్రెయిన్ కు అండగా నిలిచారు. ఉక్రెయిన్ ఒంటరి కాదంటూ భరోసా ఇస్తూనే అగ్రరాజ్యం తీరుని తప్పుబట్టారు.






