- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hostages: నలుగురు బందీల మృత దేహాల అప్పగింత.. కాల్పుల విరమణలో ఇదే తొలిసారి
పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్, ఇజ్రాయెల్‌కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్ (Hamas), ఇజ్రాయెల్ (Israel)కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నలుగురు ఇజ్రాయెల్ బందీల మృతదేహాలను హమాస్ గురువారం అప్పగించింది. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగర సమీపంలో రెడ్ క్రాస్ సంస్థ (Red cross)కు అందజేసింది. వీరిలో ఒక తల్లి, ఆమె ఇద్దరు పిల్లలు సహా మరొకరి డెడ్ బాడీలు ఉన్నారు. వారిని షిరి బిబాస్ (32), ఆమె ఇద్దరు పిల్లలు ఏరియల్ బిబాస్ (4), క్ఫిర్ బిబాస్, ఓడెడ్ లిఫ్‌స్చిట్జ్(83)గా గుర్తించారు. వీరందరినీ హమాస్ 2023 అక్టోబర్ 7వ తేదీనే బందీలుగా చేసుకుంది. అయితే ఆ టైంలో క్పిర్ బిబాస్ వయసు కేవలం 9 నెలలు మాత్రమే కావడం గమనార్హం. ఇక, పాలస్తీనియన్ హక్కుల గుర్తింపు, అరబ్బులు, యూదుల మధ్య శాంతి కోసం ప్రచారం చేసిన రిటైర్డ్ జర్నలిస్ట్ లిఫ్‌స్చిట్జ్ కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ వీరిని అధికారికంగా ప్రకటించలేదు. మృత దేహాలకు డీఎన్ఏ టెస్ట్ అనంతరం ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. కాగా, కాల్పుల విరమణలో భాగంగా మృత దేహాలను అప్పగించడం ఇదే తొలిసారి.
ఇజ్రాయెల్ దాడుల్లోనే మరణించారు: హమాస్
తాజాగా అప్పగించిన బందీలందరూ గతేడాది నవంబర్‌లో ఇజ్రాయెల్ వైమాణిక దాడిలోనే మరణించారని హమాస్ పేర్కొంది. ఇజ్రాయెల్ క్రూరమైన దాడులు బందీలను రక్షించకుండా నిరోధించాయని తెలిపింది. అయితే హమాస్ వాదనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. అంతకుముందు బందీల అవశేషాలను రెడ్‌క్రాస్‌కు అప్పగించే ముందు హమాస్ ఒక ప్రకటన విడుదల చేసింది. బందీల ప్రాణాలను రక్షించడానికి శక్తి మేరకు కృషి చేశామని తెలిపింది. హమాస్ శనివారం మరో ఆరుగురు బందీలను విడుదల చేయనుంది. మరోవైపు బందీల మృత దేహాల అప్పగింతపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Benjamin nethanyaahu) స్పందించారు. ఇదొక హృదయ విదారకమైన రోజుగా అభివర్ణించారు.






