Hostages: 8 మంది బందీలు మరణించారు.. ఇజ్రాయెల్

by B.Srinivas |

ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన సంధి ఒప్పందంలో భాగంగా విడుదల కావాల్సిన 33 మంది బందీల్లో ఎనిమిది మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది.

Hostages: 8 మంది బందీలు మరణించారు.. ఇజ్రాయెల్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్, హమాస్ (Israel-Hamas) మధ్య కుదిరిన సంధి ఒప్పందంలో భాగంగా మొదటి దశలో విడుదల కావాల్సిన 33 మంది బందీల్లో ఎనిమిది మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. అగ్రిమెంట్ ప్రకారం ఇంకా రిలీజ్ కావాల్సి ఉన్న 26 మందిలో 18 మంది మాత్రమే సజీవంగా ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధి డేవిడ్ మెన్సర్ (David mencer) తెలిపారు. సోమవారం ఆయన జెరూసలేంలో మీడియాతో మాట్లాడారు. వారి బంధువుల పరిస్థితి గురించి కుటుంబాలకు తెలియజేసినట్టు తెలిపారు. మృతి చెందిన బందీల వివరాలను ఆయన వెల్లడించలేదు. అయితే ఇజ్రాయెల్ ఆరోపణలను హమాస్ ధ్రువీకరించినట్టు పలు కథనాలు వెల్లడించాయి. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్న వేళ బందీల మరణాల వార్త బయటకు రావడంతో ఆందోళన నెలకొంది. దీనిపై ఇజ్రాయెల్ ఏవిధంగా స్పందిస్తుందోనని ఉత్కంఠ నెలకొంది.

కాగా, 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి దాదాపు 250 మందిని బందీలుగా పట్టుకున్నారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరగగా అనేక మంది పాలస్తీనియన్లు మరణించారు. ఈ నేపథ్యంలోనే ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఈ నెల 19న కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీని ప్రకారం.. 42 రోజుల పాటు సీజ్ ఫైర్ అమల్లో ఉండనుంది. ఈ టైంలో హమాస్ 33 మంది బందీలను విడుదల చేయనుండగా దానికి బదులుగా ఇజ్రాయెల్ 700 మంది పాలస్తీనా ఖైదీలను రిలీజ్ చేయనుంది. ఇప్పటి వరకు ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేయగా, 300కు పైగా ఖైదీలను ఇజ్రాయెల్ రిలీజ్ చేసింది. బందీల తదుపరి విడుదల గురువారం, శనివారం ఉండనుంది.

Next Story