ఘోర విమాన ప్రమాదం.. వీడియో వైరల్

by Vemula.Srinu Prasad |

దక్షిణ థాయిలాండ్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగింది...

ఘోర విమాన ప్రమాదం.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: దక్షిణ థాయిలాండ్‌(southern Thailand)లో ఘోర విమాన ప్రమాదం(plane crash) జరిగింది. ప్రాచువాప్ ఖిరిఖాన్ ప్రావిన్స్‌లోని(Prachuap Khiri Khan Province) హువాహిన్ జిల్లా(Hua Hin District)లో విమానం నదిలో కూలిపోయింది. పాచూట్ శిక్షణ డ్రిల్ నిర్వహించారు. అయితే ప్రమాదవశాత్తు ఫ్లైట్ కూలిపోయింది. దీంతో విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు పోలీస్ అధికారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న రాయల్ థాయ్ పోలీసు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విమానంలోని మృతదేహాలను బయటకు తీశారు.


విషయం తెలుసుకున్న RTP కమిషనర్ జనరల్ పోల్ జనరల్ కిత్రాత్ పాన్‌ఫెట్ ప్రచువాప్ ఖిరి ఖాన్‌ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు పూర్తిగా అండగా ఉంటామన్నారు. చనిపోయిన ఆరుగురు పోలీసులకు గౌరవప్రదమైన అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. ఆదేశించారు. ఘటనపై వాస్తవాలను వెలికితీస్తామని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలను నివారించేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అయింది

Next Story