పాక్‌కు బుద్ధివచ్చిందని ఆశిస్తున్నా: ఒమర్ అబ్దుల్లా

by Phanindra |

‘ఆపరేషన్ సిందూర్‌’తో పాకిస్తాన్‌కు బుద్ధి వచ్చిందని ఆశిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు.

పాక్‌కు బుద్ధివచ్చిందని ఆశిస్తున్నా: ఒమర్ అబ్దుల్లా
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్ సిందూర్‌’ తర్వాతయినా పాకిస్తాన్ బుద్ధితెచ్చుకొని, పద్ధతి మార్చుకుంటుందని ఆశిస్తున్నట్లు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా చెప్పారు. పహెల్గాం ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్ పర్యాటకంపై తీవ్రమైన ప్రభావం పడిందని ఆయన అన్నారు. ‘పాకిస్తాన్‌కు ఇప్పుడైనా బుద్ధి వస్తుందని ఆశిస్తున్నా. దీని వల్ల పాక్ ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడదని అనుకుంటున్నా. ఇకనైనా వాళ్లకు బుద్ధి రావాలని ప్రార్థిస్తున్నా’ అని చెప్పారు.

అలాగే అమర్‌నాథ్ యాత్రలో ఎలాంటి ఘటనలు, ఇబ్బందులు లేకుండా పూర్తిచేస్తేనే మళ్లీ కశ్మీర్‌పై ప్రజలకు నమ్మకం వస్తుందని, పర్యాటకులు అప్పుడే మళ్లీ వస్తారని ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. జమ్మూకశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు తెగబడటంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.

Next Story