Home Ministry: పౌర రక్షణ చర్యలను బలోపేతం చేయాలని హోంమంత్రిత్వ శాఖ లేఖ

by S Gopi |

కీలకమైన సేవలు నిరంతరాయంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని పేర్కొంది.

Home Ministry: పౌర రక్షణ చర్యలను బలోపేతం చేయాలని హోంమంత్రిత్వ శాఖ లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో భద్రత, శత్రు దాడుల ముప్పు దృష్ట్యా హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను(యూటీ) అప్రమత్తం చేసింది. పౌర రక్షణ చట్టం, 1968 నిబంధనల ప్రకారం పౌర రక్షణ చర్యలను మరింత పెంచాలని కోరింది. ప్రజలు, ఆస్తి రక్షణ కోసం అవసరమైన అన్ని చర్యలు చేపట్టడానికి, శత్రు దాడి సమయంలో కీలకమైన సేవలు నిరంతరాయంగా అందేలా అవసరమైన చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని పేర్కొంది. జమ్మూ, జైసల్మేర్ ప్రాంతాలలో పాకిస్తాన్ దళాలు గత రాత్రి చేసిన దాడులను పరిగణనలోకి తీసుకుని మంత్రిత్వ శాఖ ఈ లేఖను జారీ చేసింది. రాష్ట్రాలు, యూటీలు పౌర రక్షణ నిబంధనలను అమలు చేయాలని, సంబంధిత పౌర రక్షణ డైరెక్టర్లకు అత్యవసర సేకరణ అధికారాలను ఇవ్వాలని స్పష్టం చేసింది. ముప్పు ప్రభావాన్ని తగ్గించడానికి రాష్ట్ర, స్థానిక స్థాయిలో సకాలంలో చర్యలు, సంసిద్ధత అవసరమని అధికారులు వివరించారు. గురువారం రాత్రి సమయంలో జమ్మూకశ్మీర్, రాజస్థాన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న పాకిస్తాన్ సరిహద్దులో వరుస డ్రోన్, క్షిపణి దాడులను నిర్వహించింది. వాటన్నిటినీ భారత రక్షణ అధికారులు వైమానిక రక్షణ వ్యవస్థల ద్వారా సమర్థవంతంగా అడ్డుకున్నారు.

Next Story