Flash News: ఢిల్లీ పేలుడుపై హోంమంత్రి అమిత్ షా ఆరా.. రంగంలోకి NIA, NSG

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-11-10 15:23:05  IST  )

ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఉన్న చాందినీ చౌక్ మెట్రోస్టేషన్ వద్ద సంభవించిన పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు.

Flash News: ఢిల్లీ పేలుడుపై హోంమంత్రి అమిత్ షా ఆరా.. రంగంలోకి NIA, NSG
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ ఎర్రకోట సమీపంలో ఉన్న చాందినీ చౌక్ మెట్రోస్టేషన్ వద్ద సంభవించిన పేలుడుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. ఐబీ చీఫ్, ఢిల్లీ సీపీతో ఫోన్ లో మాట్లాడిన ఆయన.. పేలుడు సంభవించడానికి గల ప్రాథమిక కారణాలను అడిగి తెలుసుకున్నారు. పేలుడుపై వెంటనే దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించడంతో ఎన్ఐఏ, NSG, ఢిల్లీ పోలీస్ స్పేషల్ సెల్ దర్యాప్తు చేపట్టాయి. ఈ క్రమంలో పేలుడు సంభవించిన ప్రదేశానికి సమీపంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీలు పరిశీలించగా ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. కాగా.. పేలుడు జరిగిన ప్రాంతంలో దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. పేలుడు ధాటికి శరీరాలు ఛిద్రమయ్యాయి. అనేక మంది తీవ్రగాయాలతో ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ పేలుడులో 30 మందికి గాయాలవ్వగా.. LNJP ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Next Story