ఆల్ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్సును ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా

by Naga Rani Yarlagadda |

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah).. ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్సును (All India Speakers Conference) ప్రారంభించారు.

ఆల్ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్సును ప్రారంభించిన హోంమంత్రి అమిత్ షా
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah).. ఆల్ ఇండియా స్పీకర్స్ కాన్ఫరెన్సును (All India Speakers Conference) ప్రారంభించారు. ఈ సదస్సు ఢిల్లీ అసెంబ్లీ (Delhi Assembly) భవనంలో రెండ్రోజులపాటు జరగనుంది. తొలుత అమిత్ షాకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, సీఎం రేఖా గుప్తా, అసెంబ్లీ స్పీకర్ విజేందర్ గుప్తా స్వాగతం పలికారు. అనంతరం శాససభకు మొదటి స్పీకర్‌గా ఎన్నికైన విఠల్ భాయ్ పటేల్ 100వ వార్షికోత్సవం సందర్భంగా నివాళులు అర్పించారు.

రెండ్రోజులపాటు జరిగే సదస్సులో దేశానికి పునాది వేసిన వ్యక్తుల గురించిన విషయాలను వివరించడం, చర్చించడం వంటివి ఉంటాయని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. శాసనసభ పద్ధతులు, ప్రజాస్వామ్య విలువలు, పార్లమెంటరీ విధానాలపై సంభాషణ, సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఈ సదస్సు జరుగుతుందని పేర్కొన్నారు. ఏఐ ఆధారిత సాధనాల సాధనాలు సహా డిజిటల్ ఆవిష్కరణలపై ఈ సమావేశం దృష్టి సారించింది.

Next Story