మహిళలకు హోలీ, దీపావళి కానుకలు

by Gantepaka Srikanth |
మహిళలకు హోలీ, దీపావళి కానుకలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు(Delhi Assembly Elections) సమీపిస్తోన్న వేళ బీజేపీ మేనిఫెస్టో(BJP Manifesto) విడుదల చేసింది. శుక్రవారం ‘సంకల్ప పాత్ర-1’ అనే పేరుతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా(JP Nadda) ఈ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో మహిళలకు ప్రతినెలా రూ.2500. పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌(Gas cylinder)పై రూ. 500 సబ్సిడీ. హో(Holi)లీ, దీపావళి(Diwali)కి ఉచితంగా గ్యాస్ సిలిండర్, గర్భిణీలకు రూ.21 వేల నగదు ఇవ్వబోతున్నట్లు మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఫిబ్రవరి 5వ తేదీన ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి.


కేంద్రంలో వరుసగా మూడోసారి అధికారం దక్కించుకున్నా ఢిల్లీలో మాత్రం గత మూడుసార్లు బీజేపీకి నిరాశ తప్పలేదు. దీంతో ఈసారి అధికారమే లక్ష్యంగా బీజేపీ మేనిఫెస్టోను ప్రత్యేకంగా రూపొందించి.. ఓటర్లను ఆకర్షించే విధంగా ప్రయత్నం చేశారు. సంకల్ప్ పత్ర పేరుతో మూడు భాగాలుగా మేనిఫెస్టో విడుదల చేస్తోంది. బీజేపీతో పాటు ప్రధాన పార్టీలన్నీ ఢిల్లీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్నాయి. ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తున్నాయి. ఓటర్లను ఆకర్షించేందుకు విపరీతమైన వరాలు జల్లులు కురిపిస్తూ.. ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ పెద్ద ఎత్తున పోటాపోటీగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నాయి.

Advertisement

Next Story