- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చారిత్రక ఘట్టం: జలాంతర్గామిలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు.

దిశ, వెబ్ డెస్క్: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) కర్ణాటక పర్యటనలో భాగంగా ఒక అరుదైన మైలురాయిని అధిగమించారు. ఉత్తర కన్నడ జిల్లాలోని కార్వార్ నౌకాదళ స్థావరాన్ని సందర్శించిన ఆమె, అక్కడ జలాంతర్గామిలో (Submarine) ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కార్వార్ హార్బర్ నుండి సముద్ర గర్భంలోకి వెళ్లిన ఈ జలాంతర్గామిలో ఆమె కొంత సమయం గడిపారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో ఒక మహిళా రాష్ట్రపతి జలాంతర్గామిలో ప్రయాణించడం దేశ రక్షణ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భాంగా నిలిచిపోయింది.
ఈ పర్యటనలో భాగంగా భారత నౌకాదళ సామర్థ్యాలను, జలాంతర్గాముల పనితీరును ఆమె స్వయంగా పరిశీలించారు. సముద్ర గర్భంలో క్లిష్ట పరిస్థితుల మధ్య దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న నౌకాదళ సిబ్బంది మరియు అధికారులతో ఆమె ముచ్చటించి, వారి ధైర్యసాహసాలను అభినందించారు. అత్యాధునిక సాంకేతికతతో కూడిన భారత నౌకాదళ వ్యవస్థలను చూసి ఆమె గర్వపడుతున్నట్లు తెలిపారు. ఈ పర్యటన భారత రక్షణ రంగంపై మరియు మహిళా శక్తిపై ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్టం చేసింది.






