- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Fire: ఆగ్నికి ఆహుతైన 154 ఏళ్ల నాటి ఐకానికి చర్చి.. న్యూ ఇయర్ వేళ విషాదం
నూతన సంవత్సరం వేళ చారిత్రాత్మక చర్చిలో అగ్ని ప్రమాదం సంభవించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నూతన సంవత్సరం వేళ నెదర్లాండ్స్రా (Netherlands) జధాని ఆమ్స్టర్డామ్‍లో (Amsterdam) భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నగరంలోని చారిత్రాత్మక వొండెల్కెర్క్ (Vondelkerk Church) చర్చి అగ్నికి ఆహుతి అయిపోయింది. 2026 నూతన సంవత్సర వేడుకల వేళ ఈ ప్రమాదం సంభవించించింది. క్షణాల్లో అగ్నికీలలు చర్చిని అంటుకుని వ్యాపించాయి. ఈ ఘటనలో చర్చి గోడలు, ఎత్తైనా టవర్ కు మంటలు అంటుకుని కూలిపోయాయి. ఘటన జరిన వెంటనే అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకుని గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం నేపథ్యంలో ముందస్తుగా చర్చి చుట్టుపక్కల ఉన్న భవనాలను అధికారులు ఖాళీ చేయించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదానికి బాణాసంచాల పేలుడే కారణం అని ప్రాథమికంగా భావిస్తున్నాయి. వొండెల్కెర్క్ చర్చి నిర్మాణం 1872 లో ప్రారంభమైంది. దీనిని ప్రసిద్ధ డచ్ ఆర్కిటెక్ట్ పియరీ క్యూపర్స్ నిర్మించారు. 1880లో కాథలిక్ ఆరాధన కోసం తెరవబడింది. 154 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చర్చిని ఇటీవల కచేరీలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలకు వేదికగా ఉపయోగిస్తున్నారు.






