BIG BREAKING: వాహనదారులకు షాక్.. భారత్‌లో పెట్రోల్ ధరలు పెంపు

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-03-20 10:12:01  IST  )

భారత్ లో పెట్రోల్ ధర పెరిగింది. లీటరుపై రూ.2.30 పైసలు పెంచుతున్నట్లు HPCL ప్రకటించింది.

BIG BREAKING: వాహనదారులకు షాక్.. భారత్‌లో పెట్రోల్ ధరలు పెంపు
X

దిశ, వెబ్‌డెస్క్: కొద్దిరోజులుగా భారత్ లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయన్న ఊహాగానాలు నిజమయ్యాయని జాతీయ మీడియా పేర్కొంది. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థ ప్రీమియం పెట్రోల్ ధరలను పెంచుతూ ప్రకటన విడుదల చేసినట్లు NDTV తెలిపింది. లీటరుపై రూ.2.30 పెంచినట్లు పేర్కొంది. పెరిగిన ధరలు తక్షణమే అమలవుతాయని, చేసింది. పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయ ఫ్యూయల్ మార్కెట్స్ పై పడిందని, ఫలితంగా పవర్ పెట్రోల్ రేట్లను పెంచక తప్పడం లేదని HPCL పేర్కొనట్లు NDTV తెలిపింది. పెరిగిన ధరతో లీటర్ పవర్ పెట్రోల్ ధర రూ.115కు చేరింది.

ఇదిలా ఉండగా.. ధరల పెంపు నేపథ్యంలో ముడిచమురు సరఫరాపై వస్తున్న వార్తలపై హెచ్‌పిసిఎల్ 'X' వేదికగా స్పందించింది. "ముడిచమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదు. అదనపు సరకు రవాణా నౌకలు ఇప్పటికే మార్గమధ్యలో ఉన్నాయి. ఇవి రాబోయే రోజుల్లో దేశీయ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయి. దయచేసి పుకార్లను నమ్మకండి, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే అనుసరించండి." అని సంస్థ పేర్కొంది. కాగా పెట్రోల్ ధరలు పెరిగాయని వస్తున్న వార్తలపై HPCL స్పష్టతనివ్వలేదు.

Next Story