హిందువుల్లో 4 రకాలు ఉన్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

by Ajay Maddhiboyina |

భారతదేశంలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 100 సంవత్సరాల సంఘ్ ప్రయాణం అనే కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు.

హిందువుల్లో 4 రకాలు ఉన్నారు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్
X

దిశ, వెబ్ డెస్క్: భారతదేశంలో నివసించే ప్రతిఒక్కరూ హిందువే అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. 100 సంవత్సరాల సంఘ్ ప్రయాణం అనే కార్యక్రమంలో మోహన్ భగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హిందూ అనేది నామవాచకం కాదని, భారతదేశ నాగరిక స్వభావాన్ని ప్రతిబింబించే విశేషణం అని వ్యాఖ్యానించారు. భారత్ లోని ముస్లింలు, క్రైస్తవులు ఈ దేశానికి చెందినవాళ్లే అని చెప్పారు. భారతదేశంలో నాలుగు రకాల హిందువులు ఉన్నారని అన్నారు. మొదటిరకంలో మేం హిందువులం అని గర్వంగా చెప్పండని ప్రకటించేవారు, రెండో రకంలో మేం హిందువులం అయితే గర్వపడడానికి ఏం ఉంది అని అడిగేవాళ్లు, మూడోరకంలో మృదువుగా ఉండేవాళ్లు.. వీళ్లు అడిగితేనే హిందువులం అని చెబుతారు.

నాలుగోరకం వాళ్లు హిందువులం అని మ‌ర్చిపోయ‌న‌వాళ్లు లేదా మ‌ర్చిపోయేలా చేయ‌బ‌డ్డ వాళ్లు అని అన్నారు. ఇంకా ఎక్కువ మందిని తాము హిందువులం అని మ‌ర్చిపోయేలా చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని చెప్పారు. హిందుత్వాన్ని స్వీక‌రించాలంటే త‌మ విశ్వాసం, భాష‌, మ‌త‌ప‌ర‌మైన ఆచారాల‌ను వ‌దులుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. హిందుత్వం మీ భ‌ద్ర‌త‌కు హామీ ఇస్తుంద‌న్నారు. ఒక వ్య‌క్తి విశ్వాసం, ఆహార‌పు అల‌వాట్లు మ‌రియు భాష బిన్నంగా ఉండొచ్చ‌ని కానీ మ‌న‌మంతా ఒకే స‌మాజం, ఒకే సంస్కృతి, ఒకే దేశం అని అన్నారు. దీన్నే హిందుత్వం అని పిలుస్తామ‌ని, దీన్నే భార‌తీయ‌త అని పిల‌వ‌చ్చ‌న్నారు.

Next Story