Bangladesh: హత్య కేసులో హిందూ సన్యాసి చిన్మయ్ దాస్ అరెస్ట్!

by Ajay Maddhiboyina |

మాజీ ఇస్కాన్ గురువు, హిందూ సన్యాసి చిన్మయ్ దాస్‌ను నాలుగు హత్య కేసుల్లో అరెస్టు చేసినట్టు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ కోర్టు ప్రకటించింది. లాయర్ సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్య కేసుతో పాటూ మరో మూడు హత్య కేసుల్లో చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేసినట్టు పేర్కొంది.

Bangladesh: హత్య కేసులో హిందూ సన్యాసి చిన్మయ్ దాస్ అరెస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఇస్కాన్ గురువు, హిందూ సన్యాసి చిన్మయ్ దాస్‌ను నాలుగు హత్య కేసుల్లో అరెస్టు చేసినట్టు బంగ్లాదేశ్ చిట్టగాంగ్ కోర్టు ప్రకటించింది. లాయర్ సైఫుల్ ఇస్లాం అలీఫ్ హత్య కేసుతో పాటూ మరో మూడు హత్య కేసుల్లో చిన్మయ్ దాస్‌ను అరెస్ట్ చేసినట్టు పేర్కొంది. బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించిన కేసులో చిన్మయ్ దాస్ గతేడాది నవంబర్ 25న అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచరులు భక్తులు నవంబర్ 26వ తేదీన నిరసన ర్యాలీ చేశారు.

ఈ నిరసన జరుపుతున్న సమయంలోనే చిన్మయ్ దాస్‌ను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ లాయర్ సైఫుల్ ఇస్లాం అలీని కొందరు పదునైన కత్తులతో దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులోనే ఇప్పుడు మరోసారి చిన్మయ్ దాస్ ను అరెస్ట్ చేశారు. మరోవైపు రాజద్రోహం కేసులో ఆరు నెలలుగా శిక్ష అనుభవిస్తున్న చిన్మయ్ దాస్‌కు బుధవారమే బంగ్లాదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇంతలోనే నాలుగు హత్య కేసుల్లో నింధితుడిగా పేర్కొంటూ చిట్టగాంగ్ కోర్టు అరెస్ట్ చేసినట్టు ప్రకటించింది.

Next Story