- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assam : అసోంలో హిందువుల జనాభా తగ్గిపోతోంది : సీఎం హిమంత
by Hajipasha |
దిశ, నేషనల్ బ్యూరో : అసోం, బంగ్లాదేశ్‌లలో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతోందని అసోం సీఎం హిమంతబిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు.

X
దిశ, నేషనల్ బ్యూరో : అసోం, బంగ్లాదేశ్‌లలో హిందువుల జనాభా గణనీయంగా తగ్గిపోతోందని అసోం సీఎం హిమంతబిస్వ శర్మ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లలోనూ ఇదే పరిస్థితి నెలకొందని ఆయన చెప్పారు. 2011 పాపులేషన్ సెన్సస్ సమాచారం ప్రకారం.. 19151 నుంచి 2011 మధ్యకాలంలో అసోంలో హిందువుల జనాభా 9.23 శాతం మేర తగ్గిపోయిందన్నారు.
అదే వ్యవధిలో బంగ్లాదేశ్‌లో హిందూ వర్గం ప్రజల జనాభా 13.5 శాతం మేర తగ్గిందని సీఎం హిమంత చెప్పారు. బంగ్లాదేశ్‌లో మైనారిటీ వర్గానికి చెందిన హిందువులపై దాడులు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్న తరుణంలో అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
Next Story






