- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hindu: హిందూ ఫోబియాకు వ్యతిరేకంగా బిల్లు.. మొదటి అమెరికా రాష్ట్రంగా జార్జియా రికార్డ్
అమెరికాలోని జార్జియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూఫోబియాకు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలోని జార్జియా (Georgia) రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకుంది. హిందూఫోబియా (Hinduphobia)కు వ్యతిరేకంగా బిల్లును ప్రవేశపెట్టింది. ఈ బిల్లు చట్టంగా మారితే హిందువులపై ద్వేషపూరిత నేరాలను గుర్తించి వాటిపై చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుంది. అమెరికాలో ఈ తరహా బిల్లును ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. ‘రిపబ్లికన్ సెనేటర్లు సీన్ స్టీల్, క్లింట్ డిక్సన్, డెమోక్రటిక్ సెనేటర్లు జాసన్ ఎస్టీవ్స్, ఇమ్మాన్యుయేల్ డీ జోన్స్ లతో కలిసి హిందూఫోబియాను అంతం చేయడానికి SB 375 చట్టానికి మద్దతు ఇచ్చారు’ అని నార్త్ అమెరికాలోని హిందూ కూటమి తెలిపింది. ఇది హిందూఫోబియా, హిందూ వ్యతిరేక పక్షపాతాన్ని గుర్తించి చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందని వెల్లడించింది. కాగా, హిందూఫోబియా అంటే మతం, కులం, రంగు ఆధారంగా హిందువుల పట్ల అవమానకరమైన వైఖరిని కలిగి ఉండటం.






