బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల హత్యలు.. ఆటో డ్రైవర్ మర్డర్

by Muthe.Rajitha |

బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు.

బంగ్లాదేశ్‌లో ఆగని హిందువుల హత్యలు.. ఆటో డ్రైవర్ మర్డర్
X

దిశ, వెబ్ డెస్క్ : బంగ్లాదేశ్‌లో హిందువులపై దారుణాలు ఆగడం లేదు. ఆదివారం సాయంత్రం బంగ్లాదేశ్‌లోని ఫెని జిల్లా దగన్‌భూయాన్ లో ఒక హిందూ యువకుడైన సమీర్ కుమార్ దాస్‌ను దారుణంగా కొట్టి చంపారు. 28 ఏళ్ల సమీర్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. దగన్‌భూయాన్ ప్రాంతంలోని దక్షిణ కరిమ్‌పూర్ ముహురి బాడి సమీపంలో దుండగులు అతనిపై దాడి చేసి.. కత్తులు, మారణాయుధాలతో కొట్టి చంపారు. అనంతరం అతని ఆటోను తీసుకొని అక్కడి నుంచి పారిపోయారు. రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో రక్తపు మడుగులో పడిఉన్న అతని శవాన్ని చూసి స్థానికులు, పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సమీర్ వద్ద ఉన్న డబ్బులు, ఫోన్ దోచుకోకపోవడంతో ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యగా భావిస్తున్నారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవలి కాలంలో బంగ్లాలో జరుగుతున్న హిందువుల హత్యలు తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి.

Next Story