- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిందీ vs మరాఠీ వివాదం.. విద్యార్ధి సూసైడ్
by Muthe.Rajitha |
మహారాష్ట్ర హిందీ-మరాఠీ వివాదం ఓ విద్యార్ధి ప్రాణాలు బలిగొంది.

X
దిశ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర హిందీ-మరాఠీ వివాదం ఓ విద్యార్ధి ప్రాణాలు బలిగొంది. మహారాష్ట్రలోని థానే జిల్లా, కళ్యాణ్‌కు చెందిన 19 ఏళ్ల అర్ణవ్ జితేంద్ర్ ఖైరే అనే యువకుడు, ములుంద్‌లోని కేల్కర్ కాలేజీలో మొదటి సంవత్సరం సైన్స్ విద్యార్థి. అతడు లోకల్ ట్రైన్‌లో కాలేజీకి వెళ్తుండగా, హిందీ-మరాఠీ భాషా వివాదం జరిగింది. హిందీలో మాట్లాడుతున్నందుకు అతనిపై 4-5 మంది యువకులు దాడి చేశారని, దీంతో మానసిక ఒత్తిడికి గురైన అర్ణవ్ ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి జితేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన వ్యక్తులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. కాగా గత కొంతకాలంగా మహారాష్ట్రలో మరాఠా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే.
Next Story






