Hindi: ఎన్ఈపీ హిందీ భాషను బలవంతంగా రుద్దదు.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

by B.Srinivas |

త్రి భాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పందించారు.

Hindi: ఎన్ఈపీ హిందీ భాషను బలవంతంగా రుద్దదు.. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
X

దిశ, నేషనల్ బ్యూరో: త్రి భాషా విధానంపై కేంద్ర ప్రభుత్వం, తమిళనాడు మధ్య నెలకొన్న వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ (Dharmendra Pradhan) మరోసారి స్పందించారు. కొత్త విద్యా విధానం రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దబోదని స్పష్టం చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ-2020 (National education policy)లో హిందీ మాత్రమే ఉంటుందని తాము ఎప్పుడూ చెప్పలేదన్నారు. విద్య మాతృభాషపై ఆధారపడి ఉంటుందని మాత్రమే చెప్పామని తెలిపారు. తమిళనాడు(Thamilnadu)లో మాతృభాష తమిళమే అవుతుందని చెప్పారు. ఆదివారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఎన్ఈపీ భారతదేశంలోని వివిధ భాషలపై దృష్టి సారించిందని, హిందీ, తమిళం, ఒడియా, పంజాబీ సహా అన్ని భాషలకు సమాన ప్రాముఖ్యత ఉందన్నారు. తమిళనాడులో రాజకీయాల కారణంగా కొద్దిమంది మాత్రమే త్రి భాషా విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ లక్ష్యాల కోసమే హిందీని వ్యతిరేకిస్తున్నారన్నారు.

Next Story