- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Himanta: యూనస్ వ్యాఖ్యలను ఖండించిన అసోం సీఎం హిమంత బిశ్వశర్మ
భారతదేశ ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Sarma) స్పందించారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారతదేశ ఈశాన్య రాష్ట్రాలపై బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ చేసిన వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ(Himanta Sarma) స్పందించారు. ఈశాన్య రాష్ట్రాలను చేరుకునేందుకు సముద్రమార్గం లేదని.. ఆ ప్రాంతానికి తామే రక్షకులమంటూ యూనస్ చేసిన వ్యాఖ్యలపై హిమంత(Himanta Sarma Slams Yunus). మండిపడ్డారు. హిమంత మాట్లాడుతూ.. ‘‘యూనస్ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. వాటిని పూర్తిగా ఖండిస్తున్నాం. భారత వ్యూహాత్మక కారిడార్ అయిన చికెన్స్ నెక్ కారిడార్ ('Chicken's Neck' corridor)తో ముడిపడి ఉన్న అంశాలనే ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి భూభాగంలో ఇది ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో ఆ కారిడార్ కలుపుతోంది. దీనిచుట్టూ నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ విస్తరించి ఉన్నాయి. గతంలోనూ ప్రధాన భూభాగాన్ని, ఈశాన్య ప్రాంతాన్ని విడిదేసేలా స్వదేశంలోనే వ్యతిరేక శక్తులు ప్రయత్నించాయి. అందుకే ఆ కారిడార్ అంతటా సమర్థవంతమైన రైల్వే, రోడ్డు నెట్‌వర్క్ అభివృద్ధి చేయడం ముఖ్యం. ఇంకా.. చికెన్స్ నెక్‌ను బైపాస్ చేసేలా రెండు భూభాగాలను అనుసంధానించే ప్రత్యామ్నాయ రహదారి మార్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అయితే అందుకు ఎన్నో సవాళ్లు ఎదురవుతాయి. సంకల్పం, ఆవిష్కరణలతో ఆ దిశగా విజయం సాధించవచ్చు. ఇక యూనస్ చేసిన ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలను తేలిగ్గా తీసుకోవద్దు. అవి వారి దీర్ఘకాలిక వ్యూహాలను ప్రతిబింబిస్తున్నాయి’’ అని నిప్పులు చెరిగారు.
కేంద్రంపై కాంగ్రెస్ విమర్శలు
మరోవైపు, ఇలాంటి పరిస్థితుల్లో ఈశాన్యరాష్ట్రాల పరంగా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానం ఏవిధంగా ఉండనుందని కాంగ్రెస్ ప్రశ్నించింది. యూనస్ వ్యాఖఅయలపై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆందోళన వ్యక్తంచేశారు. ‘‘బంగ్లాదేశ్ అనుసరిస్తోన్న విధానం ఈశాన్య ప్రాంతానికి తీవ్ర ముప్పుగా కనిపిస్తోంది. కేంద్రం మణిపూర్ ని పట్టించుకోవట్లేదు. అరుణచల్ ప్రదేశ్ లో చైనా ఒక గ్రామాన్ని నిర్మించింది. బంగ్లాదేశ్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన మనల్నే ఢాకా చుట్టుముట్టాలని యత్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మన విదేశాంగ విధానం దయనీయంగా కనిపిస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. మరోవైపు, బంగ్లాలో హైకమిషనర్‌గా పనిచేసిన వీణా సిక్రీ.. యూనస్ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘అవి దిగ్భ్రాంతికరం. ఆ విధంగా మాట్లాడటానికి యూనస్‌కు ఏమాత్రం హక్కులేదు. ఈశాన్య ప్రాంతం భారతదేశంలో అంతర్భాగమని ఆయనకు తెలుసు. ఈశాన్య భారతం ద్వారా బంగాళాఖాతంలోకి ప్రవేశించడంపై బంగ్లాతో అధికారిక ఒప్పందాలు ఉన్నాయి’’ అని స్పష్టంచేశారు. ప్రధానమంత్రి మోడీ ఆర్థిక సలహా మండలి సభ్యుడు సంజీవ్ సన్యాల్ సైతం ఈ అంశంపై స్పందించారు. యూనస్ ఈశాన్యాన్ని ఎందుకు ప్రస్తావించారని ప్రశ్నించారు. "భారతదేశంలోని 7 రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉన్నాయనే ఆధారంగా యూనస్ చైనీయులకు బహిరంగంగా విజ్ఞప్తి చేయడం ఆసక్తికరంగా ఉంది. చైనా బంగ్లాదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి స్వాగతం. కానీ, 7 ఈశాన్య రాష్ట్రాలు భూపరివేష్టితంగా ఉండటానికి గల ప్రాముఖ్యత ఏంటి?" అని ఆయన అడిగారు.






