ఎన్డీఏ శాసనభాపక్ష నేతగా ఎన్నిక.. మరోసారి అసోం సీఎంగా హిమంత

by Kema Shiva Kumar |

అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వ శర్మ వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎన్డీఏ శాసనభాపక్ష నేతగా ఎన్నిక.. మరోసారి అసోం సీఎంగా హిమంత
X

దిశ, వెబ్‌డెస్క్: అసోం (Assam) సీఎంగా హిమంత బిస్వ శర్మ (Himanta Biswa Sarma) మరోసారి బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఇవాళ జరిగిన బీజేపీ, ఎన్‌డీఏ (NDA) శాసనసభాపక్ష సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా తమ నాయకుడిగా ఎన్నుకున్నారు. దీంతో ఆయన రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమైంది. గౌహతి (Guwahat)లో కేంద్ పరిశీలకు జేపీ నడ్డా హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ నేతృత్వంలో జరిగిన కీలక సమావేశంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, అసోం గణ పరిషత్ (AGP), బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (BPF) ఎమ్మెల్యేలు హిమంత పేరును ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ మేరకు మే 12న హిమంత బిస్వ శర్మ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గౌహతిలోని ఖానాపరా పశువైద్య కళాశాల మైదానంలో జరిగే ఈ భారీ బహిరంగ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

కాగా, ఇటీవల జరిగిన అసోం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ప్రభంజనం సృష్టించింది. మొత్తం 126 స్థానాలకు గాను ఎన్‌డీఏ కూటమి 102 స్థానాలను గెలుచుకుంది. ఇందులో బీజేపీ సింగిల్‌గా 82 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. ఇది రాష్ట్రంలో బీజేపీకి లభించిన అత్యధిక సీట్ల సంఖ్య కావడం విశేషం. అసోం చరిత్రలో వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టబోతున్న తొలి కాంగ్రెసేతర నేతగా హిమంత బిస్వ శర్మ రికార్డు సృష్టించనున్నారు.

Next Story