- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హిమానీ ఇంట్లోనే తనను హత్య చేసి.. ఆమె సూట్‌కేసులోనే కుక్కి
ఈ కేసులో మరిన్ని వివరాల కోసం లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కేకే రావు స్పష్టం చేశారు.

- ప్రియుడే నిందితుడు
- బ్లాక్ మెయిల్ చేయడంతోనే హత్య?
- కాంగ్రెస్ కార్యకర్త హత్య కేసులో విస్తుపోయే నిజాలు!
దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాంగ్రెస్ కార్యకర్త హిమానీ నర్వాల్ హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. హిమానీని హత్య చేసి, సూట్ కేసులో కుక్కి హర్యానాలోని రోహ్‌తక్ బస్టాండ్ సమీపంలో వదిలేసింది ప్రియుడే అని పోలీసులు తెలిపారు. ఇప్పటికే పోలీసులు నిందితుడు సచిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, దర్యాప్తులో భాగంగా పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఒక రెసిడెన్షియల్ కాలనీలో నల్లటి సూట్ కేసును లాక్కుంటూ వెళ్తున్న వ్యక్తిని గుర్తించారు. ఆ ఫుటేజీని మరింతగా స్పష్టంగా పరిశీలించగా అతను హిమానీతో రిలేషన్‌షిప్‌లో ఉన్న సచిన్‌గా గుర్తించారు. ఫిబ్రవరి 28న రాత్రి 10 గంటల సమయంలో హర్యానాలోని హిమానీ ఇంటి సమీపంలో సీపీ టీవీ ఫుటేజ్‌లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి. హిమానీని ఆమె నివాసం ఉంటున్న ఇంటిలోనే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హర్యానాలోని బహదూర్‌గఢ్‌కు చెందిన సచిన్ కొన్నాళ్లుగా హిమానీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నాడు. అయితే సచిన్‌ను బ్లాక్ మెయిల్ చేసి అతడి నుంచి లక్షలాది రూపాయలు దోచేసిందని హిమానీపై ఆరోపణలు ఉన్నాయి. హిమానీ టార్చర్ భరించలేకే ఆమెను హత్య చేసినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
హిమానీ, సచిన్ మధ్య పెళ్లి ప్రస్తావన ఎప్పుడూ రాలేదని, వారిద్దరూ స్నేహితులుగానే కొనసాగారని రోహ్‌తక్ అడిషనల్ డీజీపీ కేకే రావు తెలిపారు. నిందితుడు సచిన్‌కు ఇప్పటికే పెళ్లైందని.. అందుకే కేవలం స్నేహితులుగానే వారు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పారు. కాగా, ఈ కేసులో మరిన్ని వివరాల కోసం లోతుగా విచారణ జరపాల్సిన అవసరం ఉందని కేకే రావు స్పష్టం చేశారు.






