- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆది కైలాష్ ప్రాంతంలో హిమమీర్‌ల యోగాసానాలు.. వీడియో వైరల్
జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా ప్రపంచం మొత్తం యోగా ఉత్సాహంతో నిండిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా ప్రపంచం మొత్తం యోగా ఉత్సాహంతో నిండిపోయింది. ఈ ఏడాది ' యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ (Yoga for One Earth, One Health)' అనే థీమ్‌తో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేకమైన రోజును పురస్కరించుకుని 36వ బెటాలియన్‌కు చెందిన ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సిబ్బంది, హిమవీర్‌లు అరుదైన స్థలమైన ఉత్తరాఖండ్‌లోని ఆదికైలాష్ (త్రిశూల ప్రాంతం) వద్ద 14,700 అడుగుల ఎత్తులో ఘనంగా యోగా వేడుకలు నిర్వహించారు. హిమాలయాలలో తీవ్రమైన వాతావరణ పరిస్థితుల మధ్య హిమవీర్‌లు యోగాసనాలు చేసి దేశానికి ఉత్తమ శారీరక, మానసిక ఆరోగ్య సందేశాన్ని పంపారు. 36వ బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యున్నత ఎత్తులో జరిపిన యోగా అభ్యాసాలలో ఒకటిగా నిలిచింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.






