మంత్రిగారి రెండో పెళ్లి.. దుమారం రేపుతున్న ఫొటోలు

by Sujitha Rachapalli |   (  Updated:2025-08-19 08:51:05  IST  )

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ అండ్ ప్రొఫెసర్ అమ్రీన్ సేఖోన్‌ను సెప్టెంబర్ 22న చండీగఢ్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆయన

మంత్రిగారి రెండో పెళ్లి.. దుమారం రేపుతున్న ఫొటోలు
X

దిశ, వెబ్ డెస్క్ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర మంత్రి విక్రమాదిత్య సింగ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ అండ్ ప్రొఫెసర్ అమ్రీన్ సేఖోన్‌ను సెప్టెంబర్ 22న చండీగఢ్‌లో వివాహం చేసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆయన అభిమానులు కంగ్రాట్స్ చెప్తున్నారు. ప్రస్తుతం పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆమె.. విక్రమాదిత్యకు ఓల్డ్ ఫ్రెండ్ కావడం విశేషం. కాగా ఇంగ్లీష్, సైకాలజీలో డ్యుయల్ డిగ్రీ చేసిన అమ్రీన్.. సైకాలజీలో పీహెచ్‌డీ కూడా చేసింది. కాగా వీరిద్దరి పిక్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో దూసుకుపోతున్నాయి.

ఇక హిమాచల్ ప్రదేశ్ పబ్లిక్ వర్క్స్ మినిస్టర్ విక్రమాదిత్య సింగ్.. 2019 మార్చి 8న రాజస్థాన్ అమెట్ రాజవంశానికి చెందిన సుదర్శనా సింగ్ చుందావత్‌ను మొదటి వివాహం చేసుకున్నారు. 2018 అక్టోబర్‌లో ఉదయ్‌పూర్‌లో ఎంగేజ్మెంట్ జరగ్గా.. జైపూర్ కనోటాగఢ్ ప్యాలెస్‌లో వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. కానీ కొద్ది నెలలకే ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు ప్రారంభమయ్యాయి. 2022లో విక్రమాదిత్య అండ్ ఫ్యామిలీపై డొమెస్టిక్ వాయిలెన్స్ కేసు పెట్టింది సుదర్శనా సింగ్. ఇందులో అమ్రీన్ కౌర్‌తో రిలేషన్ గురించి కూడా ఆరోపణలు చేసింది. ఈ కేసు 2024 నవంబర్‌లో సెటిల్ కాగా.. డివర్స్ కన్ఫర్మ్ అయింది. ఇద్దరు చట్టబద్ధంగా విడిపోయారు. దీంతో మంత్రిగారి రెండో పెళ్లికి లైన్ క్లియర్ అయింది. ఇక న్యూస్ వైరల్ కాగా మొదటి భార్య చెప్పిందే నిజమైంది, అందరూ అనుకున్నదే జరుగుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

Next Story