Breaking News : పురిట్లో బిడ్డను కోల్పోయిన తల్లులకు ప్రభుత్వం ఊరట

by Muthe.Rajitha |

మహిళలకు మాతృత్వం(Metarnity) వరం లాంటిది.

Breaking News : పురిట్లో బిడ్డను కోల్పోయిన తల్లులకు ప్రభుత్వం ఊరట
X

దిశ, వెబ్ డెస్క్ : మహిళలకు మాతృత్వం(Metarnity) వరం లాంటిది. నవమాసాలు మోసి, బిడ్డకు జన్మను ఇవ్వడం తాను మరో జన్మ ఎత్తడం లాంటిదే. పుట్టబోయే బిడ్డ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. తాను ఏమైనా సరే బిడ్డ క్షేమంగా ఉండాలని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుతుంది. కానీ కొన్నిసార్లు అనుకోకుండా ఏవేవో కారణాలతో పుట్టిన బిడ్డను పురిటిలోనే కోల్పోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో వారి గర్భశోకాన్ని తీర్చడం ఎవరి తరం కాదు. ఇక ప్రస్తుత జనరేషన్ మహిళలు ఉద్యోగాలు చేస్తూ.. ఈ బాధను పంటి బిగువున దాచడం అనేది అత్యంత కష్టతరమైనది. అయితే ఇలాంటి మహిళలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం(Himachal Pradesh Govt) భారీ ఊరట కలిగించింది. పురిట్లో బిడ్డను కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగం చేసే తల్లులకు కూడా మాతృత్వ సెలవులు(Metarnity Leaves) కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

మహిళలకు సాధారణంగా మాతృత్వ సెలవులు పిల్లలు పుట్టిన ఆరునెలల వరకు వారి ఆలనా పాలనా చూడటానికి భారత కార్మిక చట్టాల ప్రకారం ఇస్తారు. కాని పురిటిలో ఆ బిడ్డ చనిపోతే మాత్రం సెలవులు ఉండవు. కాని హిమాచల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన.. అలాంటి మాతృమూర్తులకు కొంత ఉపశమనం కలగనుంది. ఇలాంటి వారికి 60 రోజుల ప్రత్యేక మెటర్నిటీ లీవ్ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఆ రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు కూడా ఒ గుడ్ న్యూస్ తెలిపింది సర్కార్. ఇకపై పీజీ చదువుతున్న వైద్య విద్యార్థులకు పూర్తి జీతం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

Next Story