- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడు తిరుప్పరంకుండ్రంలో మరోసారి హైటెన్షన్
తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రం కొండపై గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుప్పరంకుండ్రం కొండపై గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హజ్రత్ సికిందర్ బాద్షా దర్గా వద్ద సంచనకూడు ఉత్సవాల్లో భాగంగా ఒక వర్గం వారు నెలవంక గుర్తు ఉన్న జెండాను ఎగురవేయడం వివాదానికి దారితీసింది. అక్కడ ఎప్పటి నుంచో ఉన్న పవిత్ర వృక్షంపై ఈ జెండాను ఎగురవేయడాన్ని స్థానికులు, హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఆ జెండాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకారులు పెద్ద ఎత్తున తరలి రావడంతో, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం అక్కడ సుమారు వెయ్యి మంది పోలీసులను మోహరించి, సెక్షన్ 144 (BNSS 163) కింద నిషేధాజ్ఞలు విధించింది.
ఈ వివాదంలో మద్రాస్ హైకోర్టు (మదురై బెంచ్) ఇచ్చిన తీర్పు ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. దర్గా సమీపంలోని పురాతన 'దీపత్తూన్' (శిలా స్తంభం) పై కార్తీక దీపం వెలిగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ దీపం వెలిగించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, గత 80 ఏళ్లుగా ఈ ఆచారం అమలులో లేదని, ఇప్పుడు దీపం వెలిగిస్తే శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆదేశాలను అమలు చేయడానికి నిరాకరించింది. కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ, ఒక వర్గం ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం దీపం వెలిగించకుండా అడ్డుకుంటోందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన హక్కులు, ప్రభుత్వ ఆంక్షల మధ్య ఈ వివాదం ప్రస్తుతం ముదురుతోంది.






