ఇండిగో సంక్షోభం: ఎవరినీ వదలబోం అని కేంద్రం హెచ్చరిక

by Gantepaka Srikanth |

ఇండిగో సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశం

ఇండిగో సంక్షోభం: ఎవరినీ వదలబోం అని కేంద్రం హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండిగో విమాన సర్వీసుల సంక్షోభం(Indigo Crisis)తో వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గత మూడు రోజులుగా విమానాలు భారీ స్థాయిలో ఆలస్యం కావడం లేదా రద్దు కావడం జరుగుతూనే ఉంది. ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించడంలో ఇండిగో విఫలమవుతోంది. ఈ పరిణామాలపై కేంద్రం స్పందించింది. తొలుత ఇండిగో ఎయిర్ లైన్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించింది. సంక్షోభానికి కారణం ఎవరైనా సరే.. కఠినంగా శిక్షిస్తామని పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా 550 విమానాలు రద్దయ్యాయి. టికెట్ల రిఫండ్స్, వసతి విషయంలో ప్రయాణికులు ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఇండిగో ఓ ప్రకటన చేసింది. డిసెంబర్ 5 నుంచి డిసెంబర్ 15 మధ్య రద్దు చేసిన అన్ని విమానాలకు పూర్తి టికెట్ మొత్తాల్ని తిరిగి ఇస్తామని ఇండిగో ప్రకటించింది. ప్రయాణికులు ఎలా టికెట్ బుక్ చేసుకున్నారో అదే అకౌంట్లకు డబ్బులు వెనక్కి ఇస్తామని తెలిపింది.

Next Story