- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Delhi High Court : బాబా రాందేవ్‌పై హైకోర్టు మరోసారి సీరియస్
బాబా రాందేవ్(Baba Ramdev)పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : బాబా రాందేవ్(Baba Ramdev)పై ఢిల్లీ హైకోర్టు(Delhi High Court) మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన తన సొంత ప్రపంచంలో విహరిస్తూ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారని మండిపడింది. గతంలో కోర్ట్ హెచ్చరించినా వినకుండా మళ్ళీపతంజలి ప్రొడక్ట్ 'గులాబ్ షర్బత్' ను ప్రమోట్ చేశారని ఫైర్ అయింది. దీనిపై ఆయన కోర్టు ధిక్కారణ నోటీసులు అందుకోబోతున్నారని స్పష్టం చేసింది. అయితే బాబా రాందేవ్ తన 'గులాబ్ షర్బత్' ను ప్రమోట్ చేస్తూ.. హమ్‌దర్ద్ నేషనల్ ఫౌండేషన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ సంస్థ 'రూఫ్ అప్జా' సేల్స్ తో వచ్చే సొమ్ముతో మదరసాలు, మసీదులు కడుతోందని, అందుకే వాటిని కొనకూడదని.. దానికి బదులుగా గులాబ్ షర్బత్ వాడాలని యాడ్ చేశారు.
ఈ వ్యవహారంపై హమ్‌దర్ద్ నేషనల్ ఫౌండేషన్ హైకోర్టును ఆశ్రయించగా.. అలాంటి విద్వేషపూరిత ప్రమోషన్స్ ఆపాలని ఇదివరకే ఓసారి ఆగ్రహం వ్యక్తం చేయగా.. మరోసారి కూడా అలాంటి ప్రమోషన్స్ చేయడం పట్ల సీరియస్ అయింది. కోర్ట్ ధిక్కార నోటీసులకు రెడీగా ఉండమని హెచ్చరించింది. అలాగే హమ్‌దర్ద్ యాడ్స్‌పై రాందేవ్‌ను తప్పుబట్టిన కోర్టు, 24 గంటల్లో కొత్త యాడ్ తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది.






